BigTV English

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీ అనే ముద్రను ఇప్పుడు దాదాపు చెరిపేసుకుంటోంది. ‘కె. జి .ఫ్’, ‘కాంతారా’ తరువాత ఇక్కడి నుచి పాన్ ఇండియా లెవెల్ సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కన్నడ ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది. 1960ల కాలం నాటి బెంగళూరులో పది మంది పిల్లలు ఉన్న ఒక కుటుంబం చుట్టూ ఈ కథ  తిరుగుతుంది. ఇందులో పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎలా తమ కాళ్ళ మీద నిలబడ్డారో చక్కగా చూపించారు. ఈ సినిమా వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

1960ల బెంగళూరులోని జయనగర్‌లో మధుసూదన్ ఆచార్, సావిత్రి దంపతులు తమ పది మంది పిల్లలతో (ముగ్గురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జీవిస్తుంటారు. మధుసూదన్ PWD ఇంజనీర్‌గా, కొడుకులు ఇంజనీర్లుగా, కూతుళ్లు గృహిణులుగా ఉండాలని కోరుకుంటాడు. అతను కూతుళ్ల విద్యను పెద్దగా పట్టించుకోడు. సుమ 10వ తరగతి ఫెయిల్ అయిన కూతురు. లండన్‌లో స్థిరపడాలని, బాగా చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ ఇంతలోనే మధుసూదన్ ఒక ప్రమాదంలో మరణిస్తాడు.

ఆ కుటుంబ బాధ్యతలు సుమ, ఆమె తోబుట్టువులపై పడతాయి. పెద్ద కొడుకు సుధీంద్ర దిల్లీకి ఉద్యోగం కోసం వెళ్లిపోతాడు. ఆఇంట్లో పెళ్ళి జరిగాక, అంతమంది మధ్య శోభనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అన్నయ్యలు తలా ఓదారి చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు పెళ్ళి, ఉద్యోగాల వంటి సమస్యలను ఎదుర్కొంటారు. సుమ తన కలలను పక్కనపెట్టి, కుటుంబాన్ని అదుపు చేయడానికి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటుంది. ఆమె ఇంట్లో పచ్చళ్ల తయారీ నైపుణ్యాన్ని బయటకి తెచ్చి దానిని వ్యాపారంగా మార్చడం ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.


సుమ పచ్చళ్ల వ్యాపారం విజయవంతమవుతుంది. ఆమె అక్కాచెల్లెళ్లు కూడా విద్య, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పురుషాధిపత్య సమాజంలో స్వతంత్రంగా బతకటం నేర్చుకుంటారు. ఒక సోదరి శాడిస్ట్ భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది. మరొకరు డబుల్ PhD సాధిస్తుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఈ చిత్రం సూక్ష్మంగా చూపిస్తుంది. కథ దశాబ్దాల వ్యవధిలో వేగంగా సాగుతుంది. సుమ ఒక సాధారణ అమ్మాయి నుండి కుటుంబానికి పెద్దదిక్కుగా మారుతుంది. చివరికి లండన్‌కు తన సొంత ఖర్చులతో వెళ్తుంది. ఇలా ఈ కథ ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాతో శుభం కార్డ్ పడుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘ఆచార్ & కో’ (AacharAndCo) 2023లో విడుదలైన కన్నడ కామెడీ-డ్రామా చిత్రం. ఈ సినిమాకి సింధు శ్రీనివాస మూర్తి దర్శకత్వం వహించారు.ఇందులో సింధు శ్రీనివాస మూర్తి అశోక్, సుధా బెళవాడి, అనిరుధ్ ఆచార్య, హర్షిల్ కౌశిక్, వంశీధర్ భోగరాజు నటించారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం 2023 జూలై 28న థియేటర్లలో విడుదలై, 2023 ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా కన్నడ ఆడియోతో, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also : కోరి శాపాన్ని కొని తెచ్చుకునే ఫ్యామిలీ… నెక్లెస్ కు దెయ్యాలతో లింక్… సీట్ చిరిగిపోయే హర్రర్ మూవీ

Related News

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Big Stories

×