OTT Movie : సీరియల్ కిల్లింగ్స్ తో తెరకెక్కే సినిమాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇలాంటి సినిమాలు ఓటీటీ బోలెడన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఊహించని ట్విస్టులు చాలానే ఉంటాయి. ఇందులో కిల్లర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కొక్కరిని ఘోరంగా చంపుతుంటాడు. ఆ చావులు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఈ సినిమా చూసేవాళ్ళు పోసేసుకుంటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
2018 హాలోవీన్ రాత్రిలో ఈ కథ మొదలవుతుంది. లారీ స్ట్రోడ్, ఆమె కూతురు కరెన్, మనవరాలు అల్లిసన్ ఇంటి బేస్‌మెంట్‌లో మైఖేల్ అనే కిల్లర్ ని బంధిస్తారు. అక్కడ ఒక అగ్నిప్రమాదం జరగడంతో అందరూ మైఖేల్ చనిపోయాడని భావిస్తారు. కానీ మైఖేల్ బతికి, బేస్‌మెంట్ నుండి తప్పించుకుని, పట్టణంలో మళ్ళీ హత్యలు చేయడం మొదలుపెడతాడు. గాయపడిన లారీ ఆసుపత్రిలో చేరుతుంది. అక్కడ ఆమె మైఖేల్ చేసే హత్యలను ఆపాలని పట్టుదలతో ఉంటుంది. ఈ కథ 1978లో మైఖేల్ హత్యల నుంచి బతికిన టామీ, లిండ్సే, లోనీ, నర్స్ మారియన్ లను తిరిగి తీసుకొస్తుంది. వీళ్లు మైఖేల్ క్రూరత్వాన్ని దగ్గరనుంచి చూసిన వాళ్ళు.
ఇప్పుడు మైఖేల్ హాడన్‌ఫీల్డ్‌లో హత్యలు చేస్తూ తన పాత ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని ఆపడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తారు. కానీ అతని హింసాత్మకత శక్తి ముందు వీళ్ళంతా నిలువలేక పోతారు. టామీ, లిండ్సే మైఖేల్ చేతిలో దారుణంగా చనిపోతారు. అల్లిసన్, కరెన్ కలిసి మైఖేల్‌ను ఎదిరించడానికి ప్రయత్నిస్తారు. కానీ కరెన్ మైఖేల్ చేతిలో హత్యకు గురవుతుంది. ఇది లారీకి భారీ షాక్ ఇస్తుంది. మైఖేల్ ఒక సూపర్‌నాచురల్ శక్తిగా మారాడని, అతన్ని ఆపడం అసాధ్యమని లారీ గ్రహిస్తుంది. చివరి సన్నివేశంలో మైఖేల్ తన ఇంటి కిటికీలో నుంచి బయట చూస్తూ, అతని సైకో తనాన్ని గొప్పాగా ఫీల్ అవుతుంటాడు. ఈ కథ ఇలా ముగుస్తుంది.
‘హాలోవీన్ కిల్స్’ (Halloween Kills) 2021లో విడుదలైన అమెరికన్ స్లాషర్ హారర్ చిత్రం. డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వంలో, జామీ లీ కర్టిస్ (లారీ స్ట్రోడ్), జూడీ గ్రీర్ (కరెన్ నెల్సన్), ఆండీ మాటిచాక్ (అల్లిసన్ నెల్సన్), జేమ్స్ జూడ్ కోర్ట్నీ (మైఖేల్ మైయర్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1978లోని హాలోవీన్, 2018లోని హాలోవీన్ చిత్రాలకు సీక్వెల్‌గా, 2021 అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలై, 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా పీకాక్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో ఇంగ్లీష్ ఆడియోతో, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Read Also : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ