E-Paper
Advertisement

నేటి నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆధ్యాత్మిక వండర్ హనుమాన్ అంశ్’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడాలంటే?

నేటి నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆధ్యాత్మిక వండర్ హనుమాన్ అంశ్’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడాలంటే?
Advertisement

Hanuman Ansh on OTT: సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్లు ఉండాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కథలో బలం, గుండెను తాకే ఎమోషన్ ఉంటే.. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందని నిరూపించిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). కేవలం రూ. 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచిన ఈ సెన్సేషనల్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భక్తులు ఎంతో ప్రేమగా ‘మహారాజ్ జీ’ అని పిలుచుకునే నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం స్ఫూర్తితో విశాల్ చతుర్వేది ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై రికార్డులు తిరగరాసిన ఈ మూవీ, ఇప్పుడు హిందీతో పాటు తెలుగు సహా ఐదు ప్రాంతీయ భాషల్లోనూ డిజిటల్ తెరపైకి వస్తుండటంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆ అద్భుతమైన కథేంటో, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

తల్లి మరణం.. ఆధ్యాత్మిక అన్వేషణ.. నీమ్ కరోలి బాబాగా మారిన బాలుడు

ఈ సినిమా లక్ష్మీనారాయణ్ అనే చిన్న బాలుడి జీవితంతో ఎంతో భావోద్వేగభరితంగా మొదలవుతుంది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన బాధతో తీవ్రంగా కుంగిపోయిన ఆ పిల్లాడు.. అసలు జీవితం అంటే ఏంటి? మరణం ఎందుకు వస్తుంది? దేవుడు నిజంగా ఎక్కడ ఉంటాడు? అనే ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతుంటాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఇల్లు వదిలి ఉత్తర భారతదేశం అంతటా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో తారసపడే మనుషులు, ఎదురయ్యే సంఘటనలు అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. క్రమంగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ భక్తి, ప్రేమ, కరుణ, తోటివారికి చేసే సేవలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఒక బాలుడు ఆధ్యాత్మిక పరివర్తన చెంది, చివరకు కోట్లాది మంది కొలిచే నీమ్ కరోలీ బాబాగా ఎలా మారాడు అనేదే ఈ సినిమా కథ.

Advertisement

ముఖ్యంగా ఆంజనేయ స్వామిపై ఆయనకున్న అపారమైన భక్తి, కష్టాల్లో ఉన్నవారి పట్ల చూపించే ప్రేమ, ఆకలితో ఉన్నవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టడం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయడం వంటి అంశాలను దర్శకుడు కళ్లు చెమర్చేలా చూపించారు. ఒక ఆధ్యాత్మిక గురువు జీవిత చరిత్రను చెప్పడమే కాకుండా, ఆయన బోధనలు నేటి ఆధునిక తరానికి, మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయనే కోణాన్ని ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే కేవలం భక్తి సినిమాలను ఇష్టపడేవాళ్లకే కాకుండా, జీవిత సత్యాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ఓటీటీలో ఎక్కడ చూడాలి?

‘హనుమాన్ అంశ్’ ఓటీటీ హక్కులు భాషల వారీగా రెండు వేదికలకు వెళ్లాయి. సినిమా ఒరిజినల్ హిందీ వెర్షన్ 2026 నవంబర్ 27 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు నవంబర్ 29 నుంచి Netflixలో అందుబాటులోకి రానున్నాయి. అంటే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూడాలంటే నవంబర్ 29 వరకు వేచి చూడాలి. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్యా నీమ్ కరోలి బాబా పాత్ర పోషించారు. బాల్యంలోని పాత్రలో విహాన్ షెడ్గే కనిపిస్తారు. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ భాషల వారీగా ప్రేక్షకులను చేరుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నవారు నవంబర్ 29 నుంచి Netflixలో చూడవచ్చు.

Advertisement

Read Also: స్కూల్‌కు వెళ్లాలంటేనే వణికిపోయే పిల్లాడు… మామయ్య ఎంట్రీతో హీరోగా మారితే… ఓటీటీలో సూపర్ హిట్ మూవీ

Tags

Related News

20 ఏళ్లుగా తొక్కిపెట్టిన అమ్మాయి మిస్సింగ్ కేసు.. కోర్టులో బయటపడ్డ భయంకర నిజాలు… థ్రిల్లింగ్ సిరీస్

డేటింగ్ యాప్ ఆఫీసులో సీక్రెట్ లవ్… ఓటీటీలోకి వచ్చిన క్రేజీ రొమాంటిక్ సిరీస్

కొత్తగా పెళ్లై కాలనీలోకి వచ్చిన జంట… రాత్రికి రాత్రే భార్య అదృశ్యం.. ఓటీటీలోకి ఆసక్తికరమైన థ్రిల్లర్

Friday OTT Releases : మూవీ లవర్స్ కు పునకాలే.. ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్స్ సినిమాలు..!

నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో ఆ పాక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు బ్రేక్!

ఫేస్‌బుక్ రహస్యాలను లీక్ చేసిన మాజీ ఉద్యోగిని… టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన నిజ జీవిత థ్రిల్లర్ స్ట్రీమింగ్

ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న ఆదర్శ కుటుంబం!

Big Stories

Advertisement
×