E-Paper
Advertisement

త్వరలో నంది అవార్డ్స్ ప్రధానోత్సవం.. కొత్త బాధ్యతలు చేపట్టిన బాలయ్య!

త్వరలో నంది అవార్డ్స్ ప్రధానోత్సవం.. కొత్త బాధ్యతలు చేపట్టిన బాలయ్య!
Advertisement

Balakrishna:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న బాలకృష్ణ (Balakrishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్స్ అధినేతగా ఇలా ఒక్కటేమిటి పలు బాధ్యతలతో నిత్యం బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అలాంటి బాలయ్య ఇప్పుడు మరో కీలకమైన బాధ్యతలను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017- 2025వ సంవత్సరాలకు గానూ.. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది.. ఆ కమిటీకి చైర్మన్గా నందమూరి బాలకృష్ణను నియమించగా.. సభ్యులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh), ఎస్ గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభను నియమించింది.

నంది అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్గా నందమూరి బాలకృష్ణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగా అభివృద్ధి సంస్థ (APSFTVTDC ) మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ నియామకానికి సంబంధించి తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయవాడలోని APSFTVTDC మేనేజింగ్ డైరెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది ఇక రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ ఉత్తర్వులను అధికారికంగా జారీ చేశారు.

గత పది ఏళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల ప్రధానోత్సవం..

Advertisement

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి నటీనటుల ప్రతిభకు తగిన గుర్తింపు అందించడానికి ప్రధానం చేసే ఈ అవార్డులను ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొంతకాలం పాటు అవార్డుల ప్రధానోత్సవాలు జరగలేదు. కానీ నటీనటుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు ప్రధానం చేయడానికి గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట పురస్కారాలను అందజేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో అవార్డులు ఎప్పుడు ఇస్తారు అనే చర్చ కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

also read:ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

వచ్చేనెల ఘనంగా ప్రధానోత్సవం..

Advertisement

ఈ నేపథ్యంలోని మొన్నామధ్య నంది అవార్డులపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా అధికారిక ప్రకటన చేశారు. ఇక ఏపీ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా భరత భూషణ్ నియమితులైన తర్వాత అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. పైగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. 2017 – 2024, 2025 సంవత్సరాలకు గానూ నంది అవార్డుల ప్రధానోత్సవం వేడుకను డిసెంబర్లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు 2017 నుండి 2025 సంవత్సరాల మధ్య అవార్డుల ఎంపికకు వేరువేరు జ్యూరీ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. డిసెంబర్లో విజయవాడ లేదా అమరావతి వేదికగా నంది పురస్కార ప్రధానోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 26న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ తెలుగు సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి ఈ నంది అవార్డులను అందజేయనున్నారు.

Related News

Aditirao Hydari : ఏంటి.. ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?

నాని నా బెస్ట్ ఫ్రెండ్.. 20 ఏళ్ల స్నేహంపై నితిన్ ఎమోషనల్ కామెంట్స్!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి పేరు కూడా రివీల్!

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

Big Stories

Advertisement
×