Paradise: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి అని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా రికార్డ్స్ అంటే ఒక తీరుగా ఉండేది. ఇప్పుడు సినిమా రికార్డ్ అంటే ఓన్లీ కలెక్షన్స్. అందుకే చాలామంది నిర్మాతలు రియాలిటీ కి దూరంగా పోస్టర్ పైన ఫ్యాన్స్ ను హ్యాపీ చేయటానికి ఎంత పడితే అంత కలెక్షన్ వేస్తూ పోతారు.
అలానే ఒకప్పుడు సినిమా హిట్ ప్లాప్ అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా కాదు ఒక సినిమా పొద్దున్న విడుదల అయితే సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు. చాలావరకు సినిమాలకు ఇదే జరుగుతుంది. అలానే కొంతమంది దర్శకులుపై కొన్ని సీన్స్ ను ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొడుతున్నారు అని విమర్శలు వస్తూనే ఉంటాయి. అలానే కొన్ని పోస్టర్స్ విషయంలో కూడా ట్రోలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక సినిమా విషయంలో అదే జరుగుతుంది.
నాని సినిమా పోస్టర్ కాపీనా.?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా పారడైజ్. ఇదివరకే మీరు కాంబినేషన్లో దసరా అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడుగా శ్రీకాంత్ కు అది మొదటి సినిమా అయినా కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుంది అంటే అంచనాలు ఉండటం సహజం. అలానే నాని కూడా పలు సందర్భాలలో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిపాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పొద్దున్న ఒక ఫస్ట్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు. దానికి కొన్ని ఎలివేషన్స్ కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అలానే రీసెంట్గా వచ్చిన పోస్టర్ పైన ట్రోలింగ్ కూడా మొదలైంది. ఇది విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పోస్టర్ కాపీ అంటూ చర్చలు మొదలయ్యాయి.
డిజాస్టర్ లైగర్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎన్నో అంచనాలు ఉండేవి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కానీ కంప్లీట్ గా రేంజ్ మార్చేసింది ఆ సినిమా. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా ఆ సినిమా భారీ డామేజ్ చేసింది. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. ఒక ఫైట్ సీన్లో విజయ్ మధ్యలో ఉంటే మిగతా అందరూ విజయ్ చుట్టూ ఉంటారు. అప్పట్లో ఈ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పుడు నాని పోస్టర్ దాదాపు చూడటానికి అలానే ఉంది. కానీ పోస్టర్ డీటెయిల్ వేరు. కానీ చూడగానే అలా కనిపిస్తుంది కాబట్టి ట్రోల్ తప్పడం లేదు.
Also Read: Mahesh Babu: తమిళ్ సూపర్ స్టార్ తో పని అయిపోయింది, ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్