Mahesh Babu: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ ఒకరు. మా నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్. ఈ సినిమాను తెలుగులో నగరం పేరుతో విడుదల చేశారు.
ఈ సినిమాలో సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా కలిసిన నటించారు. ఇకపోతే ఫస్ట్ సినిమా తోనే టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు లోకేష్. మొదటి సినిమాకే లోకేష్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
మహేష్ బాబుతో లోకేష్
మైత్రి మూవీ మేకర్ సంస్థలో లోకేష్ కనగరాజ్ ఒక సినిమా చేయబోతున్నారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అవే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ 2 సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ తెలుగులో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబును తీసుకుంటారు అని విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ మహేష్ బాబు హీరో అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో జరగదు అనే క్లారిటీ అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే మినిమం రెండు మూడు ఏళ్లు గ్యారంటీగా పడుతుంది. లోకేష్ అయితే సినిమాను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాడు. ఈ ప్రకారం చూసుకుంటే ఖైదీ అయిపోయిన తర్వాత మహేష్ తో పట్టాలెక్కే అవకాశం ఉంది.
మల్టీస్టారర్ లైనప్
ఖైదీ సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఏకంగా మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. తలపతి విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కలిసి నటించిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. ఈ సినిమాలో విజయ్ కి లోకేష్ రాసిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఆ కేరక్టరైజేషన్ కూడా చాలామంది ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా విక్రమ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం రజినీకాంత్ తో కూలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
Also Read : Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్