E-Paper
Advertisement

ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?

ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?
Advertisement

Naslen K.Gafoor:ఇటీవలకాలంలో కొంతమంది సెలబ్రిటీలు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంటే.. మరికొంతమంది విడాకులు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమంది ప్రేమాయణం నడుపుతూ ఆ వార్తలతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ప్రేమలు’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్డం సంపాదించుకున్న మలయాళ యంగ్ హీరో నస్లేన్ కే. గఫూర్ (Naslen K gafoor) ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి కూడా ఇండస్ట్రీకి చెందినవారు కావడం విశేషం. మరి నస్లేన్ ప్రేమలో పడ్డ ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఇలా తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రేమలో పడ్డ ప్రేమలు హీరో..

ప్రేమలు సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ 26 ఏళ్ల కుర్రాడు నస్లేన్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. తాజాగా సీన్ సినిమాలో ధీటైన విలన్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా సూర్య నటననే డామినేట్ చేసిన ఇతని నటనకు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఈశ్వరన్ పాత్ర ఇతని కోసమే పుట్టిందా అన్నట్లు అనిపించిందని కొంతమంది చెప్పుకొస్తున్నారు కూడా.. అలా ఈ ఒక్క సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నస్లేన్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. మరొకవైపు ప్రేమలో పడ్డాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది . ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి, మోడల్ అనార్కలి నాజర్ (Anarkali Nazar).

ఆమె ఎవరో కాదు అనార్కలి నాజర్..

Advertisement

ఇకపోతే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను సింగిల్ గా లేను అని ఒక చిన్న క్లూ ఇవ్వడంతోనే.. ఆ అదృష్టవంతురాలు ఈమె అయి ఉంటుందని నెటిజన్లు ఊహాగానాలు మొదలు పెట్టేశారు. మోహన్ కుమార్ ఫ్యాన్స్, బ్లడీ బెగ్గర్ వంటి చిత్రాలతో అనార్కలి నాజర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ప్రేమలు సినిమా కంటే ముందే వీరిద్దరూ కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా వీరిద్దరి ఫ్యాన్ మేడ్ వీడియోలు , ఎడిట్ ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో ఈ లవ్ రూమర్లకు మరింత బలం చేకూరింది. పైగా తమ ఫోటోలను ఒకే చోట దిగి వేరువేరుగా పోస్ట్ చేయడం, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడంతో అభిమానులు కూడా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు నస్లేన్ ఇటు అనార్కలి ఇద్దరు అధికారికంగా ప్రకటించలేదు.

also read:‘బిగ్ బాస్’ హౌస్‌లో శివ్, ప్రియాంక ఎంగేజ్మెంట్ డ్రామా, ఇంకా ఎన్నిసార్లు బ్రో?

లవ్ రూమర్స్ పై సన్నిహిత వర్గాలు రియాక్షన్..

Advertisement

పైగా వీరిద్దరూ ఒకే ఫ్రెండ్ సర్కిల్ కు చెందిన వారు కావడం గమనార్హం . ఇకపోతే నస్లేన్ సన్నిహిత వర్గాలు మాత్రం వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని, ఎలాంటి రిలేషన్ వీరి మధ్య లేదు అని , కేవలం స్నేహం తప్ప మరో బంధం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నస్లేన్ కెరియర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందని, ఇలాంటి సమయంలో ప్రేమాయణాలు లాంటివి పెట్టుకోడని, హీరోగా ఎదగాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా చెబుతున్నాయి.. మరి చూద్దాం మునుముందు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారా? లేక రూమర్స్ గానే ఈ వార్తలు నిలిచిపోతాయా అన్నది.

Related News

అయ్యో.. మోనాల్ కు ఏమైంది..? ఇది అస్సలు ఊహించలేదుగా..

రఘువరన్-రోహిణి విడాకులకు కారణం అదేనా? తల్లి చెప్పిన కన్నీటి నిజాలు!

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!

11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×