E-Paper
Advertisement

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!
Advertisement

Shanaya Kapoor:షనాయా కపూర్..బాలీవుడ్‌లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డ ఈ యంగ్ బ్యూటీ ఇపుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.ఈ క్రమం లోనే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి. గోల్డెన్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో కొలువుదీరిన ఈ ముద్దుగుమ్మ ‘Stay Golden’ అంటూ చిన్న క్యాప్షన్ యాడ్ చేయడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

ముఖ్యంగా ఈ ఫోటోషూట్‌లో షనాయా వేసుకున్న గోల్డెన్ కలర్ డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. మెరిసిపోయే ఎంబ్రాయిడరీ వర్క్, ఆకట్టుకునే డిజైన్, అందుకు తగ్గట్టుగా ఎంచుకున్న జ్యువెలరీ ఆమె లుక్‌కు మరింత క్లాసీగా మార్చాయనడంలో సందేహం లేదు.ముఖ్యంగా గోల్డెన్ బ్యాక్‌డ్రాప్‌కు మ్యాచ్ అయ్యేలా ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ నెక్స్ట్ లెవెల్.

Advertisement

ఈ ముద్దుగుమ్మ విషయానికి వస్తే సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌ల కుమార్తె అయిన షనాయా కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి పరిచయాలే ఉన్నాయి. అయితే నటిగా సత్తా చాటాలనే ప్రయత్నంలో భాగంగా వరుసగా సరికొత్త ప్రాజెక్టులను ఎంచుకుంటు బిజీ అయిపోతుంది .అలా 2020లో విడుదలైన జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ అమ్మడు ఆ తర్వాత నటనపై ఫోకస్ చేస్తూ హీరోయిన్ గా మారిపోయింది.

అలా ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత ‘తూ యా మైన్’ చిత్రంతో మరోసారి తానెంటో ప్రూవ్ చేసుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలా విభిన్నమైన కథలని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

Advertisement

ఇక షనాయా కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ లో వస్తున్న ‘జాంబీ రెడ్డి 2 ..తేజ సజ్జా నటిస్తున్న ఈ ప్రాజెక్టుతో ఆమె తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది.చూడాలి ఈ సినిమా ఆమెకు సౌత్ ఆడియన్స్ లో ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో .మరోవైపు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అవుతుంది ఈ అందాలభామ.

ఇక నవంబర్ 13న జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానున్న ఈ సిరీస్‌లో ఆమె డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తుంది .ఇక ఇప్పటికే ఈ సిరీస్ నుండి వచ్చిన అప్ డేట్స్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది కూడా!మొత్తంగా ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు ఫ్యాషన్ ఫోటోషూట్లు, సోషల్ మీడియా పోస్టులతో షనాయా కపూర్ సందడి చేస్తూ ఇలా సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.


ALSO READ :రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

Tags

Related News

రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!

11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!

సినిమా అంటే సబ్బుల వ్యాపారం కాదు.. తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !

త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!

Big Stories

Advertisement
×