E-Paper
Advertisement

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!
Advertisement

Venkatesh Anil:వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఎంత క్యూరియాసిటీ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేశాయి మరి. ఇక ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘జనవరి 12 విడుదల’ పై కూడా అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయి.ఇక ఈ సినిమా సంక్రాంతి సీజన్‌ లో వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా తాజాగా బయటకు వచ్చిన ప్రమోషనల్ అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీగా మారింది.అమెరికాలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ చేయని స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేయడం విశేషం. సాధారణంగా తెలుగు సినిమాలకు అమెరికాలో ప్రీమియర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అభిమానులతో మీటింగ్స్ పెట్టడం కొత్తేం కాదు.
అయితే ఈసారి మాత్రం వరుస నగరాల్లో అనేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా మేకర్స్ ప్లాన్ చేయడం ఇక్కడ విశేషం.

Advertisement

ఈ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆస్టిన్, డల్లాస్ నగరాల్లోనూ ప్రమోషన్స్ జోరుగా సాగనున్నాయి. అంటే ఈ ఏడాది లాస్ట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడపనున్నారన్న మాట.

నిజానికి ఒకప్పుడు కేవలం పెద్ద సినిమాలకే ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు దక్కేవి.కానీ ఇప్పుడు మంచి స్టోరీ ఉంటే చాలు చిన్న సినిమాలు కూడా అక్కడి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇదిగో దీన్ని గ్రహించే ఓవర్సీస్ లోనూ సాలిడ్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నాయి మూవీ యూనిట్స్.

Advertisement

ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి కనిపించనుంది.చూడాలి మరి వెంకీ మామ తో ఇప్పటికే అదరగొట్టిన అనిల్ రావిపూడి ఈ ముగ్గురి కాంబినేషన్‌ను స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడో!

గతంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అయితే ఏకంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లని కొల్లగొట్టడం విశేషం.చూడాలి మరి ఈ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న ఈ ‘జనవరి 12 విడుదల’ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ALSO READ :11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

Tags

Related News

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!

సినిమా అంటే సబ్బుల వ్యాపారం కాదు.. తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !

త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!

Big Stories

Advertisement
×