E-Paper
Advertisement

తండ్రిగా ప్రమోట్ అయిన జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

తండ్రిగా ప్రమోట్ అయిన జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!
Advertisement

Jabardasth Comedian:అటు వెండితెర ఇటు బుల్లితెర ఇండస్ట్రీలలో సెలబ్రిటీలు వరుస శుభవార్తలు చెబుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంటే.. ఇంకొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నాం అంటూ ఆ శుభవార్తలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీ పంచ్ లతో విపరీతంగా ఆకట్టుకుంటున్న పటాస్ ప్రవీణ్ (Patas Praveen) కూడా తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ నేరుగా హాస్పిటల్ నుండే ఆ వీడియోని అభిమానులతో షేర్ చేశారు.

తండ్రైన పటాస్ ప్రవీణ్..

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి అయిన ప్రవీణ్ ప్రముఖ డాన్సర్ కడెం వంశిత (Vanshitha) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వంశిత ఇటీవల గర్భం దాల్చింది. ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్న ప్రవీణ్ ఇక ఇప్పుడు తన తండ్రిగా ప్రమోట్ అయినట్లు అభిమానులకి తెలిపారు. ప్రవీణ్ షేర్ చేసిన వీడియోలో ప్రసవానికి ముందు ప్రవీణ్ తన భార్య వంశితకు సేవలు చేయడం , అలాగే వంశిత ఆపరేషన్ థియేటర్ కి వెళ్లడం, డాక్టర్ పాపను తీసుకురావడం, పాపను ఎత్తుకొని తండ్రిగా ప్రవీణ్ సంతోష పడడం వంటి ఎన్నో దృశ్యాలు ఆ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు తండ్రిగా ప్రమోట్ చెందిన ప్రవీణ్ , వంశిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మా అమ్మ మళ్లీ పుట్టింది – ప్రవీణ్

Advertisement

ఈ ఏడాది ప్రారంభంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు చాలా రోజులుగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్ సెలబ్రిటీలు , బుల్లితెర తారలు వీరిద్దరి వివాహానికి హాజరైన దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.ఇప్పుడు ఒక పండంటి పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ జంట. మొత్తానికి అయితే తన” తల్లి మళ్ళీ పుట్టింది” అని తలుచుకొని ప్రవీణ్ ఆనందభాష్పాలతో అందరినీ ఏడిపించేశారు. ఇకపోతే ప్రవీణ్ షేర్ చేసిన ఈ వీడియోలో పాప ముఖాన్ని కూడా రివీల్ చేశారు. ఇక ఆ పాప చాలా క్యూట్ గా ఉండడంతో అభిమానులు అంతే సంబరపడిపోతూ ఈ క్యూట్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

also read:ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?

జబర్దస్త్ ప్రవీణ్ కెరియర్..

Advertisement

పటాస్ షో తో కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ఇక్కడ స్టాండప్ కమెడియన్ గా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తనదైన పంచులు, కామెడీతో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైన ప్రవీణ్.. జబర్దస్త్ లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.

?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

Illu Illalu Pillalu Today Episodes: ట్రావెల్ ఏజెన్సీ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..భాగ్యం మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Karthika Deepam 2 Serial Today Episode November 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని, జ్యోత్స్న ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు…?   

Gundeninda GudiGantalu Today episode: నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : కేశవ ఫుల్ హ్యాపీ.. వరాలుకు దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ హైలెట్ సీన్..

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Big Stories

Advertisement
×