E-Paper
Advertisement

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Sonu Sood:సోనూ సూద్..సినిమాల్లో విలన్‌ పాత్రలు ధరించే ఈ క్రేజీ ఫిలిమ్ స్టార్ రియల్ లైఫ్ లో ఎంతో మందికి సహాయం చేసిన సంగతి తెల్సిందే.మరీ ముఖ్యంగా కరోనా సమయంలో సోనూ సూద్ అందించిన సేవలు ఎవరూ మర్చిపోలేరు కూడా.అలాంటి గొప్ప మనసు ఉన్న ఈ వెర్సటైల్ స్టార్ ఇప్పుడు ఎయిర్‌పోర్టులు,హోటళ్లలో పనిచేసే ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఇలా మనసులోని మాటల్ని బయట పెట్టారు.

రోజుకు 10 నుంచి 12 గంటల పాటు

Advertisement

సాధారణంగా ఎయిర్‌పోర్టులకు వెళ్లినప్పుడు అక్కడి కౌంటర్లలో పనిచేసే సిబ్బంది, హోటళ్ల రిసెప్షన్ దగ్గర ఉండే ఉద్యోగులు ఎప్పుడూ నిలబడే కనిపిస్తుంటారన్నసంగతి తెల్సిందే. ఇక ఇదే విషయన్ని చెబుతూ ఎంతో మంది కస్టమర్లకు సేవలు అందిస్తూ గంటల తరబడి తమ విధులు నిర్వహిస్తుంటారని అలా వీరు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిలబడాల్సి వస్తుందని అలా డ్యూటీలో ఉన్నంత సేపు నిలబడటం వల్ల ఎంత అలసట ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు.

రెస్ట్ తీసుకునే అవకాశం

Advertisement

ఇదే విషయంపై తాజాగా ఎక్స్ లో సోనూ సూద్ రియాక్ట్ అవుతూ.. ఎయిర్‌పోర్ట్ అధికారులు, లాంజ్ నిర్వాహకులు, హోటల్ యాజమాన్యాలు ఉద్యోగులు కాసేపు కూర్చునేందుకు ప్రతి కౌంటర్ దగ్గర హై స్టూల్స్ లేదా కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పని లేని సమయంలోనైనా వారు కూర్చుని రెస్ట్ తీసుకునే అవకాశం కల్పించాలని అన్నారు.

అతిథులకు సౌకర్యాలు కల్పించడమే హాస్పిటాలిటీ రంగం ప్రధాన ఉద్దేశం. మరి అలాంటి సేవలు అందించే ఉద్యోగుల గురించి కూడా యాజమాన్యాలు ఆలోచించాలి కదా? అని సోనూ సూద్ ప్రశ్నించారు. మనం హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది నవ్వుతూ పలకరించి మన అవసరాలు తీరుస్తారని కానీ వారి వెనుక ఎంత శ్రమ ఉంటుందో చాలాసార్లు పట్టించుకోమని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

దీనివల్ల ఉద్యోగులకు ఎంతో రిలీఫ్

ఒక ఉద్యోగి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవడం పెద్ద విషయం కాదని, అది అతని హక్కు అని, విశ్రాంతి అనేది ఎవరో ఇచ్చే ప్రత్యేక సౌకర్యం కాదని, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన కనీస గౌరవమని చెప్పారు. ఇప్పటికైనా అన్ని ఎయిర్‌పోర్టులు, హోటళ్లు ఈ మార్పు చేయాలని కోరారు. దీనివల్ల ఉద్యోగులకు ఎంతో రిలీఫ్ కలుగుతుందని తెలిపారు.

ఇక సోనూ సూద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరిగా ‘ఫతే’ (Fateh) అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటించిన సంగతి తెల్సిందే .ఇక ఈ సినిమాతోనే దర్శకుడిగానూ పరిచయమవ్వడం విశేషం . ఇక ప్రస్తుతం ‘నంది’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి, ఉద్యోగులకు కూర్చునే అవకాశం కల్పించాలంటూ సోనూ సూద్ చేసిన ఈ విజ్ఞప్తి ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ :పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !

Tags

Related News

11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

సినిమా అంటే సబ్బుల వ్యాపారం కాదు.. తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !

త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!

కవల పిల్లలు పుట్టారంటూ రూమర్స్.. క్యూట్ రిప్లై ఇచ్చిన సమంత!

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ రిలీజ్ డేట్ లాక్… ప్రేక్షకులకు కిక్ ఇచ్చేనా?

విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కోడలు?

Big Stories

Advertisement
×