Monal Gajjar : తెలుగు ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ హీరోయిన్లకు ఎప్పటికీ ఎంట్రీ ఉండనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల హీరోయిన్లకే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నార్త్ నుంచి వస్తున్న హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు కూడా ఎక్కువగా రావడంతో. ప్రతి ఒక్కరు కూడా ఆ హీరోయిన్లను చూసి ఎందుకు ఆసక్తి కూడా కనిపించడంతో తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నా హీరోయిన్ల లిస్టులోకి చాలామంది చేరారు. అలాంటి ముద్దుగుమ్మల్లో మోనాల్ గజ్జర్ ఒకరు.. సుడిగాడు సినిమాతో టాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకొన్నప్పటికీ.. సుడి తిరగని హీరోయిన్ మోనాల్ గజ్జర్.. పలు సినిమాల్లో నటించిన కూడా ఈమెకు హిట్ సినిమా అనేది పడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆ వీడియోలో ఆమె మెడకు ఏదో కట్టు లాగా ఉండడంతో ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి మోనాల్ కు ఏమైంది..? ఎందుకు ఆమె మెడకి ఆ కట్టు వేసుకుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు మోనాల్ గజ్జర్.. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడు సినిమాలతో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 4 లో ఈమె కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.. తన నటనతో పాటుగా అఖిల్ తో ఆమె ప్రేమాయణం హైలెట్గా నిలవడంతో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు వీడియోలను షేర్ చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన హెల్త్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో మోనాల్ మెడకు ఏదో స్టిక్కర్ వేసినట్లు కనిపిస్తుంది. అసలు ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? లేదంటే ఏదైనా కారణమా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి ఆమెకు ఏమైంది అన్న విషయం ప్రస్తుతానికైతే క్లారిటీగా తెలియలేదు. మరి దీనిపై మోనాల్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
?dlrf=MTc0bXN4MmkzNWowdA==
గుజరాతి అమ్మాయి అయినా ఈ అమ్మడు.. టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా యావరేజ్ టాక్ ని అందుకోవడంతో ఆమెకు పెద్దగా హిట్ టాక్ అయితే రాలేదు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది కానీ ఆ సినిమాలు కూడా ఆమెకు సరైన హిట్ ని అందించలేకపోయాయి.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె సెలబ్రిటీ ఇంటర్వ్యూలు బుల్లితెరపై షోలు కొన్ని ఇంటర్వ్యూలు ఇలా బిజీగా మారిపోయింది. వీటితోపాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఈమె అన్నిటికీ గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే సినిమాలు చేస్తుందా? లేదంటే ఇంకేదైనా ప్రోగ్రాంలో కనిపిస్తుందా? అన్నది చూడాలి..