Venky Kudumula:నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘రాబిన్‌హుడ్’ సినిమా బాక్సాఫీస్ బొక్కబోర్లా పడ్డ సంగతి తెల్సిందే. ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ కుడుముల ఈ సినిమా ప్లాప్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో తాను చేసిన ఆలోచనే సినిమా ప్లాప్ కావడానికి ఒక కారణం అని ఒప్పేసుకున్నాడు. ‘రాబిన్‌హుడ్’ అనే పేరు వినగానే ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచాన్ని, మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఊహించుకున్నారని తెలిపారు. కానీ సినిమా విషయంలో ఆ అంచనాలకు తగ్గట్టుగా కథను తీసుకెళ్లలేకపోయామని తన మనసులో మాటని బయట పెట్టాడు.
‘భీష్మ’తో పోలిక వస్తుందనే భయం!
నితిన్‌తో ‘భీష్మ’ సినిమా చేసినప్పుడు మంచి లవ్ ఎంటర్‌టైనర్ అందించామని మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రేక్షకులు ‘భీష్మ’తో పోల్చే అవకాశం ఉందని భావించారట. అందుకే ఈసారి కొంచెం చెప్పాలని ఆ కథ సెలెక్ట్ చేసుకున్నాని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో గంజాయి వరల్డ్, భారీ విలన్, ప్రపంచాన్ని కాపాడే హీరో వంటి సీన్స్ తో స్టోరీని భారీగా ఊహించానని అలా ఆలోచిస్తూ అసలు తాను వెళ్లాల్సిన దారి నుంచి పక్కకు వెళ్లిపోయానని తర్వాత గుర్తించినట్లు సరదాగా చెప్పుకొచ్చాడు.
ఫ్లాప్ బాధ్యత నాదే.. ఎవరినీ నిందించను!
ఇక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరో నితిన్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని తనకు ఎంతో సపోర్ట్ చేశారనిఎవరూ తనను తప్పుబట్టలేదని, తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపాడు. అయితే సినిమా ఫెయిల్యూర్ అయితే తనను తానే ఎక్కువగా ప్రశ్నించుకుంటానని చెప్పుకొచ్చాడు.
అయితే సినిమా హిట్ అయితే అది టీమ్ వర్క్ అని, ఫ్లాప్ అయితే మాత్రం ఎక్కడ తప్పు చేశానో ముందుగా తనలో తాను వెతుక్కుంటానని చెప్పడం విశేషం.తనలో సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువని, అందుకే కొత్త సినిమా మొదలుపెట్టడానికి కూడా చాలా సమయం తీసుకుంటానని వివరించాడు.
నితిన్‌తో అనుబంధం అలాగే ఉంది!
ఇకపోతే ‘రాబిన్‌హుడ్’ ప్లాప్ అయినప్పటికీ నితిన్‌తో తన రిలేషన్ లో ఎలాంటి మార్పు రాలేదని వెంకీ స్పష్టం చేశాడు. నితిన్ తనకు అన్నయ్య లాంటి వారని, ‘భీష్మ’తో తనపై నమ్మకం ఉంచిన ఆయనకు మరో మంచి విజయాన్ని అందించలేకపోయాననే బాధ మాత్రం తనలో ఉందని వాపోయాడు. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’ డిజాస్టర్ పై వెంకీ కుడుముల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ:11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!