E-Paper
Advertisement

రఘువరన్-రోహిణి విడాకులకు కారణం అదేనా? తల్లి చెప్పిన కన్నీటి నిజాలు!

రఘువరన్-రోహిణి విడాకులకు కారణం అదేనా? తల్లి చెప్పిన కన్నీటి నిజాలు!
Advertisement

Raghuvaran Life:రఘువరన్..శివ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన ఈ వెర్సటైల్ యాక్టర్ తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడనే చెప్పాలి. ముఖ్యంగా గంభీరమైన గొంతు, తనకే సొంతమైన డైలాగ్ డెలివరీ, కళ్లతోనే భయం పుట్టించే రఘువరన్  హీరోలకు ధీటుగా విలన్ పాత్రల్లో జీవించాడు అనడంలో సందేహం లేదు.అయితే అలా బిజీగా సినిమాలు చేస్తూనే డ్రగ్స్ కి బానిస అయిన రఘువరన్ చిన్న తనంలో కన్ను మూసాడన్న సంగతి తెల్సిందే.అయితే తాజాగా రఘువరన్ తల్లి కస్తూరి ఒక ఇంటర్వ్యూలో రఘువరన్ గురించి చెప్పిన విషయాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

సినిమాల్లో ఎంత భయంకరమైన విలన్‌గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవారని ,ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకునేవారని, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు తల్లి కస్తూరి. ముఖ్యంగా ఎవరైనా సమస్యతో తన దగ్గరకు వస్తే, తనకు ఉన్నా లేకపోయినా సాయం చేయాలనే ఆలోచన ఆయనలో ఉండేదని గుర్తుచేసుకున్నారు. నటుడిగా రఘువరన్ ఎంతో టాలెంటెడ్ అని, ఒక పాత్రలోకి వెళ్లిపోయి పూర్తిగా ఆ పాత్రగానే మారిపోయేవారని వివరించారు.

Advertisement

అయితే రఘువరన్ సినిమాల్లోకి వెళ్ళడం తండ్రికి సినిమా రంగంలోకి వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. అయినప్పటికీ తన కుమారుడి ఇష్టాన్ని గుర్తించిన తాను తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి చెన్నైకి పంపించారని తెలిపారు. మొదట సంగీతంపై ఆసక్తితో గిటారిస్ట్‌గా కూడా పనిచేసిన రఘువరన్, ఇళయరాజా దగ్గర సంగీత బృందంలో పనిచేసిన అనుభవం సంపాదించారని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఇక రఘువరన్, నటి రోహిణి మధ్య జరిగిన విడాకుల గురించి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు క్రమంగా పెద్దవయ్యాయని చెప్పారు. ముఖ్యంగా చెన్నైలో నిర్మించిన కొత్త ఇంటికి వెళ్లాలనే విషయంలో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండేవని, అలాగే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలనే రోహిణి నిర్ణయం విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని వివరించారు.

Advertisement

అయితే ఈ విషయాలన్నీ తమకు తెలిసిన కోణంలో మాత్రమే చెబుతున్నామని, అసలు నిజం దేవుడికే తెలుసని స్పష్టం చేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ కొంతకాలం ఇద్దరి మధ్య రాకపోకలు కొనసాగాయని తెలిపారు. వారి కుమారుడు రిషి ప్రస్తుతం అమెరికాలో MBBSచేస్తున్నాడని, సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని కూడా తెలిపారు.

ఇక రఘువరన్ వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడుతూ తాగే అలవాటు, ఇతర అలవాట్లు ఉన్నప్పటికీ వాటిని ఎక్కువ చేసి చూపడం సరికాదని చెప్పుకొచ్చారు.కొన్ని అలవాట్లు ఉన్నాయని చెబుతూనే, వాటి కారణంగా ఆయన షూటింగులకు వెళ్లలేని పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పారు. చిన్న వయసులోనే షుగర్ సమస్యతో బాధపడినట్లు కూడా గుర్తుచేసుకున్నారు.

ఇక రఘువరన్ మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయనకు అప్పట్లో 49 ఏళ్లు మాత్రమేనని, ఒకరోజు రాత్రి నిద్రపోయిన ఆయన ఉదయం లేవకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారని, గుండెపోటు కారణంగా ఆయన మరణించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత విజయ్, ధనుష్ సహా చాలా మంది సినీ ప్రముఖులు ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారని కస్తూరి చెప్పిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

ALSO READ :గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

Tags

Related News

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!

11.11న ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!

10 గంటలు నిలబడాల్సిందేనా?..హోటళ్లు, ఎయిర్‌పోర్టులకు సోనూ సూద్ స్ట్రాంగ్ కౌంటర్!

సినిమా అంటే సబ్బుల వ్యాపారం కాదు.. తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదంటే..అసలు విషయం చెప్పిన బాబు మోహన్ !

Big Stories

Advertisement
×