Indian Hill Stations: చుట్టూ అందమైన లోయలు, ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య హిల్ స్టేషన్స్ అద్భుతంగా కనువిందు చేస్తాయి. వేసవిలో చాలా మంది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు వెళ్తుంటారు. భగభగ మండే ఎండల్లో కూల్ కూల్ గా చిల్ అవుతారు. తాజాగా హిల్ స్టేషన్స్ కు సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలిశాక.. హిల్ స్టేషన్స్ కు వెళ్లాలంటేనే టూరిస్టుల గుండెల్లో గుబులు రేగుతోంది. వద్దు బాబోయ్ అనే పరిస్థితి నెలకొంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
తాజాగా హఙల్ స్టేషన్స్ కు సంబంధించి జరిపిన అధ్యయనంలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాల మీదుగా ఉన్న మేఘాలలో ప్రమాదకరమైన స్థాయిలో విషపూరిత లోహాలు ఉన్నాయని తేలింది. ఈ మేఘాల కారణంగా వల్ల క్యాన్సర్ తో పాటు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. సైన్స్ అడ్వాన్సెస్ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, తూర్పు హిమాలయాల మీదుగా ఉన్న మేఘాలు సాధారణం కంటే 1.5 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది. కాడ్మియం, రాగి, జింక్,లాంటి విషపూరిత లోహాల సాంద్రత 40–60% ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ కాలుష్య కారకాలు క్యాన్సర్ తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు వెల్లడించింది.
కీలక అవయవాలపై తీవ్రమైన ఎఫెక్ట్
మేఘాలలోని విషపూరత లోహాల కారణంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు స్టడీ రిపోర్టు తెలిపింది. “ఈ విషపూరిత లోహాల వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, హృదయనాళ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. క్రోమియం పీల్చడం వల్ల ఆస్తమా, న్యుమోనియా, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులు వస్తాయి. కాడ్మియం, రాగి, నికెల్ ను దీర్ఘకాలికంగా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది” అని అధ్యయనం తెలిపింది. పెద్దలతో పోల్చితే పిల్లలు ఈ విషపూరిత లోహాల ప్రమాదానికి గురయ్యే అవకాశం 30% ఎక్కువగా ఉందని అధ్యయనం హెచ్చరించింది.
తాజాగా అధ్యయనంలో విశ్లేషించిన మేఘాల నీటి నమూనాలను మహాబలేశ్వర్ (పశ్చిమ కనుమలు), డార్జిలింగ్ (తూర్పు హిమాలయాలు)లోని మేఘాల నుండి సేకరించారు. ఈ మేఘాలు ఆల్కలీన్ గా ఉన్నాయని గుర్తించారు. pH విలువలు మహాబలేశ్వర్ లో 6.2 నుంచి 6.8 వరకు, డార్జిలింగ్ లో 6.5 నుంచి 7.0 వరకు ఉన్నట్లు వెల్లడించారు.
కాలుష్యానికి కారణం ఏంటి?
ఈ కాలుష్యంపై బోస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కాలుష్యం వెనుక ప్రధాన కారణాలు ట్రాఫిక్ ఉద్గారాలు, శిలాజ ఇంధన దహనం, పట్టణ వ్యర్థాలను కాల్చడం అన్నారు. రోడ్డు నుంచి వెలువడే దుమ్ము, నేల కోత కూడా మేఘాలలో విషపూరిత లోహాలు పేరుకుపోవడానికి కారణం అవుతుందన్నారు. వర్షాకాలంలో హిల్ స్టేషన్స్ మీద ఎక్కువ సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కలిగే అవకాశం ఉందన్నారు.
Read Also: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!