BigTV English

HHVM: మెగా ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కారణం అదేనా?

HHVM: మెగా ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కారణం అదేనా?

HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చివరిగా తన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) తో కలిసి ‘బ్రో’ సినిమా చేశారు. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత రెండేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన పవన్ కళ్యాణ్.. రాజకీయాలపై ఫోకస్ చేశారు. కూటమితో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఏకంగా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు కాస్త సమయాన్ని కుదుర్చుకొని ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నిర్మాత కామెంట్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. జూలై 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. జూలై 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈ చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) పలు విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ దూరమైందా? లేక వీళ్లే మెగా ఫ్యామిలీని దూరం పెట్టారా? అనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నిర్మాత ఏ.ఎం. రత్నం మాట్లాడుతూ.. ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), రాజమౌళి (Rajamouli) వంటి వారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అని తెలిపారు.


హరిహర వీరమల్లు మూవీకి అందుకే మెగా ఫ్యామిలీ దూరం..

మరి చిరంజీవిని అతిథిగా పిలవాలని అనుకోలేదా? అని నిర్మాతను ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ..” కుటుంబ సభ్యులను ఈ ఈవెంట్ కి పిలవకూడదు అనే ఒక సిద్ధాంతం పెట్టుకున్నాము. ఆ కారణంగానే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా ఈవెంట్ కి ఆహ్వానించలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికైతే చిత్ర బృందం పెట్టుకున్న సిద్ధాంతం మేరకే మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఈ చిత్రానికి దూరంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం కాస్త చిత్ర బృందం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ కి వస్తే బాగుంటుందని, ఎందుకంటే చిరంజీవి ఏ సినిమా గురించి అయినా సరే నిండు మనసుతో మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఆయన మాటలే సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నో ఎమోషనల్ సంఘటనలు జరిగి ఉంటాయి కదా.. వాటి గురించి కూడా చిరంజీవి నోటి నుండి వింటే ఇంకాస్త సంతోషంగా ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులు వీరే..

ఇకపోతే శిల్పకళ వేదికలో జూలై 23వ తేదీన సోమవారం సాయంత్రం ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, కర్ణాటక ప్రాంతం నుండి పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. చాలాకాలం తర్వాత తన సినిమా ఈవెంట్ లోనే పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇక అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ALSO READ:TarakaRatna: భర్త పోయిన బాధ లేదు.. వేస్ట్ జనరేషన్.. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన తారక్ భార్య!

Related News

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?

Big Stories

×