BigTV English

TarakaRatna: భర్త పోయిన బాధ లేదు.. వేస్ట్ జనరేషన్.. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన తారక్ భార్య!

TarakaRatna: భర్త పోయిన బాధ లేదు.. వేస్ట్ జనరేషన్.. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన తారక్ భార్య!

TarakaRatna:ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టే పోస్టులకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. చాలామంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతీసేలా ఎన్నో షాకింగ్ పోస్టులు పెడుతూ.. వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న బాధలో లేక భర్త చనిపోయిన బాధలో ఉంటే వారిని గిచ్చి మరీ వేధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక పోస్ట్ దివంగత నటుడు తారకరత్న(Taraka Ratna) భార్య అలేఖ్య మీద వైరల్ అవుతోంది. అయితే అలేఖ్యకి ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ పెట్టాడు. దాంతో ఆ నెటిజన్ కామెంట్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.


నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అలేఖ్య..

ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక నెటిజన్ భర్త చనిపోయాడు అనే బాధ కూడా లేదు.. వేస్ట్ జనరేషన్ అంటూ కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ పై మండిపడ్డ అలేఖ్య రెడ్డి ‘వావ్ మిమ్మల్ని ఏ జనరేషన్ వాళ్ళు పెంచారో ఆలోచిస్తున్నాను సార్’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ కి అలేఖ్య రెడ్డి ఇచ్చిన కౌంటర్ నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఆమె గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. భర్త పోయినా పిల్లల్ని పోషిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అని మెచ్చుకుంటున్నారు.


ఒకేసారి 9 సినిమాలు అనౌన్స్ చేసిన హీరోగా వరల్డ్ రికార్డ్..

ఇక నందమూరి ఫ్యామిలీ అనే భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకేసారి 9 సినిమాలను అనౌన్స్ చేసి వరల్డ్ రికార్డు సాధించారు.ఇప్పటివరకు ఈయన రికార్డుని కొల్లగొట్టిన హీరోలు ఎవరూ లేరు.ఇక ఈయన నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు.అలా నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తారకరత్న ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. దానికి తోడు ఇంట్లో నుండి ఫ్యామిలీ వాళ్ళు కూడా వెలివేశారు. ఎందుకంటే తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో అలేఖ్యని తీసుకొని బయటికి వచ్చేసారు.

అందుకే అలేఖ్యను ఇంటి కోడలుగా ఒప్పుకోలేదు..

అయితే అలేఖ్యని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడానికి కారణం అలేఖ్యకి అప్పటికే పెళ్లవ్వడంతో.. తారకరత్న పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. దాంతో భార్యని తీసుకొని బయటికి వచ్చేసారు. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని పిడుగు పడింది. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) జీవితం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. అప్పటికే వీరికి ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

తారకరత్న మృతి.. అలేఖ్యకు తీరని దుఃఖం..

ఇక తారకరత్న నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని అదే యాత్రలో సొమ్మసిల్లి పడిపోయాడు.దాంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించగా హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్యులు తేల్చారు. ఇక బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ (Narayana Hrudayalaya Hospital) కి మెరుగైన చికిత్స కోసం తీసుకువెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది.అలా దాదాపు నెల రోజులకు పైగా చావు తో పోరాడి చివరికి ఫిబ్రవరి 18 శివరాత్రి రోజున శివైక్యం పొందారు. ఈయన మరణించిన సమయంలో కూడా తారకరత్న తల్లిదండ్రులు చాలాసేపటి వరకు రాలేదు. చివర్లో వచ్చారు. కొడుకు చనిపోయిన కూడా కోడల్ని, పిల్లల్ని దగ్గరికి తీయలేదు. దాంతో అలేఖ్య రెడ్డి అత్తమ్మలకు దూరంగానే తన బతుకేదో తాను బతుకుతుంది. కానీ భర్త చనిపోయిన ఆడది అంటే అందరికీ అలుసే అన్నట్లు అలేఖ్య రెడ్డిపై సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇలా వచ్చిన కామెంట్స్ కి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

ALSO READ:Pushpa 2 Vs HHVM: ఫ్యాన్స్ మధ్య మళ్లీ వార్ మొదలు!

Related News

Tejeswi Madivada : బిగ్ బాస్ లో చేసిన ఆ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీకి దూరమాయ్యాను.. తేజు షాకింగ్ కామెంట్స్..

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Big Stories

×