Ravindra Jadeja: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ముగిశాయి. ఈ మూడు మ్యాచ్ లలో రెండు ఇంగ్లాండ్ గెలిస్తే.. ఒక మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇక నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగబోతోంది. అయితే లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవడంతో.. రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేయడమే కాకుండా.. బ్యాట్ తోను విలువైన పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే బ్యాట్ తోను రాణించాడు జడేజా. ఇక ముఖ్యంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే చాలు జడేజా చెలరేగిపోతాడు. అలా లార్డ్స్ టెస్ట్ లోని నాలుగవ ఇన్నింగ్స్ లో 193 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో.. టీమిండియా విజయం కోసం రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడాడు.
ఒకానొక దశలో భారత్ ను గెలిపించేలా బ్యాటింగ్ చేశాడు. కానీ అతడికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో టీమిండియా 22 పరుగుల తేడాతో మూడవ టెస్ట్ లో ఓడిపోయింది. మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రవీంద్ర జడేజా బ్యాటింగ్ అందరి మనసులను గెలుచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ మహిళా వికెట్ కీపర్ తో రవీంద్ర జడేజా వైరల్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్ధరాత్రి సారా టేలర్ ఒక గంటలో సోషల్ మీడియాలో రవీంద్ర జడేజాకి డజన్ల కొద్ది మెసేజ్ లు పంపించింది. కానీ ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. 2014లో రవీంద్ర జడేజా ఇదే కారణంతో వార్తల్లో నిలిచాడు. ఆ విషయాన్ని ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
జడేజా – సారా టేలర్ మధ్య సంభాషణ వైరల్:
2014 పురుషుల, మహిళల టీ-20 ప్రపంచ కప్ జరుగుతోంది. భారత పురుషుల జట్టు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఫైనల్ కీ చేరుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ మహిళల జట్టు కూడా ఫైనల్ కీ అర్హత సాధించింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ మహిళా జట్టులోని వికెట్ కీపర్ సారా టేలర్, టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మధ్య జరిగిన సంభాషణ అందరికీ తెలిసిపోయింది. 2014 ఏప్రిల్ 7న రాత్రి రవీంద్ర జడేజా.. సారా టేలర్ కి ఓ వ్యక్తిగత మెసేజ్ పంపించాడు.
అయితే జడేజా ఆమెని ట్విట్టర్ లో ఫాలో కాకపోవడంతో ఈ మెసేజ్ బహిరంగంగా కనిపించింది. అనంతరం సారా టేలర్ ట్విటర్ లో రవీంద్ర జడేజాకు సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. ఇక గంటన్నర సమయంలోనే జడేజాకి 12 ట్వీట్లు చేసింది. అన్నింటికీ జడేజాను ట్యాగ్ చేయడంతో.. ఈ విషయం దాదాపు అందరూ గుర్తించారు. ఈ మెసేజ్ లలో ముఖ్యంగా జడేజా ని ట్యాగ్ చేస్తూ.. ” రేపు రాత్రి నువ్వు వస్తావా”, అంటూ ఒక మెసేజ్.. మరొక మెసేజ్ లో.. ” ఉదయం 10 గంటలకు పూల్ దగ్గర” అని రాసింది.
Also Read: IND Vs PAK : పాకిస్తాన్ ను దెబ్బతీసిన టీమ్ ఇండియా క్రికెటర్లు.. వీళ్లురా నిజమైన మొనగాళ్లు
అయితే ఆ తర్వాత సారా టేలర్ మెసేజ్ కి రవీంద్ర జడేజా సమాధానం ఇచ్చాడా..? లేదా..? అనేది మాత్రం తెలియ రాలేదు. కానీ తాజాగా వీరి సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జడేజా 2016లో రీవాబాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. నాలుగో టెస్ట్ జూలై 23 నుండి ప్రారంభం కాబోతోంది. ఈ నాలుగోవ టెస్టులో రవీంద్ర జడేజా మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.