E-Paper
Advertisement

జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?

జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?
Advertisement

Jana Nayagan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం జన నాయగన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా అవతరించిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా విడుదలకు ముందే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి సీఎం అయిన తర్వాత విజయ్ నటించిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసింది? మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిందెంత ? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జన నాయగన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయనకు అక్కడ భారీగానే ఓపెనింగ్ దక్కింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ వర్షన్ రూ.36.50 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఇండియాలో మొదటి రోజు ఈ సినిమాకి రూ.41 కోట్లు నెట్ కలెక్షన్ వసూల్ చేసింది. అంటే తమిళ్ నుంచే సుమారుగా రూ.36.50 కోట్లు రాగా.. తెలుగులో కేవలం రూ.2.75 కోట్లు లభించింది. ఇక హిందీలో రూ.1.75 కోట్ల నెట్ కలెక్షన్స్ లభించాయి. అటు ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.30 కోట్ల గ్రాస్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం.

Advertisement

also read:ప్రధానిని కూడా వదలని ప్రకాష్ రాజ్.. “భయపడ్డారంటూ” సెటైరికల్ పోస్ట్!

హ్యాట్రిక్ అందుకున్న విజయ్..

మరొకవైపు అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకుంటే బుక్ మై షోలో 10 లక్షల కంటే ఎక్కువ టికెట్లు విడుదలకు ముందే అమ్ముడై రికార్డు సృష్టించింది. వరిసు, గోట్ చిత్రాల తర్వాత జన నాయగన్ అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన చిత్రాల జాబితాలో చేరింది. పైగా బుక్ మై షో లో 10 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాలలో మూడు సినిమాలు విజయ్ వే కావడం గమనార్హం. అలా వరుసగా మూడుసార్లు ఈ ఘనత సాధించి హ్యాట్రిక్ అందుకున్నారు విజయ్. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తరుణంలో ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని తేలడంతోనే అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా.. కూతురు పాత్రలో మమిత బైజు, విలన్లుగా ప్రకాష్ రాజ్ , బాబి డియోల్, ప్రియమణి నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

విజయ్ రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే ఈ సినిమా కోసం విజయ్ ఎంత పారితోషికం తీసుకున్నారు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకు ఏకంగా రూ.250 నుండి రూ.275 కోట్ల వరకు ఆయన రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నెంబర్ వన్ హీరోగా విజయ్ నిలుస్తారు అనడంలో సందేహం లేదు.

Related News

నన్ను మోసం చేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ పై విజయశాంతి కామెంట్!

ప్రధానిని కూడా వదలని ప్రకాష్ రాజ్.. భయపడ్డారంటూ సెటైరికల్ పోస్ట్!

జననాయగన్ రేర్ ఫీట్..ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా విజయ్ దళపతి!

విజయ్ ‘ జన నాయగన్ ‘ ఫస్ట్ కలెక్షన్స్?.. అస్సలు ఊహించలేదు..!

Ramya Pasupuleti : రమ్య పసుపులేటి బ్యాగ్రౌండ్.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. రొమాంటిక్ డ్రామాతో కిరణ్-గౌరీ జంట మెప్పించిందా?

Big Stories

Advertisement
×