Prakash Raj:విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సమాజంలో జరిగే పలు అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అంతేకాదు రాజకీయాల పరంగా కూడా సెటైరికల్ పోస్ట్ లు పెడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసుకొని కామెంట్లు చేసిన ఈయన.. ఇటీవల ప్రశ్నా రావణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. అయితే ఇప్పుడు సీజేపీ ఉద్యమంను దృష్టిలో పెట్టుకొని.. ప్రధాని మోదీ స్పందించడంతో ఏకంగా ఆయనను కూడా వదలకుండా..” భయపడ్డారు.. మోదీలో ఆ భయాన్ని చూశాను” అంటూ చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఢిల్లీలోని జంతర్ మంతర్ నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులకు అండగా సినీ సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటు సీజేపీ, ఇటు విద్యార్థులు సంయుక్తంగా ఈ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. , ఢిల్లీలో మొదలైన ఈ నిరసన సెగ ఇటీవల కేరళ, హైదరాబాద్ ముంబై వంటి ప్రాంతాలకు కూడా తగిలింది. ఎంతోమంది ప్రముఖులు ఈ నిరసనలో పాల్గొంటూ.. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇకపోతే నిరసనలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా అర్ధరాత్రి ఒక వీడియోను విడుదల చేశారు . దానిపై ప్రకాష్ రాజ్ పై స్పందిస్తూ సంచలన కామెంట్లు చేశారు.
జూలై 24న కేబినెట్ భేటీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మరింత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామంటూ ప్రధాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.. దానికి ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రధాని పోస్ట్ ను ఉద్దేశించి..”డర్ గయా.. నేను ఆయనలో భయాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను”.. అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు సంయుక్తంగా సాగిస్తున్న ఈ పోరాటం వల్లే.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు నీట్ తదితర పేపర్ లీక్ ఘటనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతకు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు. కేంద్రం నిర్ణయం మార్చుకోవడానికి.. ఐక్యంగా నిలబడిన యువత తెగించేతత్వమే కారణం అని వ్యాఖ్యానిస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ ను షేర్ చేయడం ఇప్పుడు నెట్ చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
also read:జననాయగన్ రేర్ ఫీట్..ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా విజయ్ దళపతి!
మరొకవైపు పేపర్ లీక్ ల అడ్డుకట్ట, సోనం వాంగ్ చుక్ హామీల అమలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ల నడుమ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. పేపర్ లీకేజీలపై పాల్పడే వారిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలు ఖరారు చేసే కొత్త బిల్లు ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాదు పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి దానిని చట్టంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ లు ఎత్తివేత, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, సభలో సమగ్ర చర్చపై కేబినెట్ స్పష్టతనివ్వనుందని తెలుస్తోంది . మరి కాసేపట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియనుంది అని చెప్పవచ్చు.
Dar Gaya 😉😉 I can see fear … thank you ❤️❤️❤️ the youth of my country.. thank you my cockroaches for this .. thank uuuuu. #justasking https://t.co/Zawv70HaCh
— Prakash Raj (@prakashraaj) July 23, 2026