Janhvi kapoor: సాధారణంగా సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీలోకి పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మంచి కథ కథనంతో పాటు అంతకుమించి అద్భుతమైన డైరెక్షన్ విలువలు కలిగిన దర్శకుడిని రంగంలోకి దింపుతూ ఉంటారు. స్వయంగా ఆ సినిమాలను నిర్మించడానికి కూడా వెనకాడరు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అతిలోక సుందరి, దివంగత నటీమని శ్రీదేవి (Sridevi ) కూడా తన కూతుర్ని ఇండస్ట్రీలోకి పంపించడానికి అలాంటి పని చేసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా ఆమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi kapoor)ఒక టాక్ షోలో వెల్లడించడం విశేషం.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా కాజోల్ (Kajol ), ట్వింకిల్ కన్నా (Twinkle Khanna)హోస్ట్గా వ్యవహరిస్తున్న “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్”టాక్ షోకి జాన్వీ కపూర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సమయంలోనే గత కొంతకాలంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ రూమర్స్ ఎదుర్కొంటున్న జాన్వీని ఇదే ప్రశ్న అడిగారు ఆ ఇద్దరు. దీంతో అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. కానీ అది నా తల్లి శ్రీదేవి మార్గదర్శకంలోనే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ..” నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక మా అమ్మ సలహా ఉంది. ఆమె అనుభవం వల్లే నేను తప్పులు చేయకుండా ముందుకు వచ్చాను. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో చూసిన దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఎవరో చేసినట్టు మనం కూడా సర్జరీ చేయించుకోవాలి అనుకోవడం చాలా ప్రమాదకరం.. ఇక నేను నా శరీరాన్ని అంగీకరించాను. మనం నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. అమ్మ ఎప్పుడూ కూడా నా ప్రతి అడుగులో తన ముద్ర వేసింది. నన్ను ప్రేమతో చూసుకుంది. మార్గదర్శకురాలుగా నిలిచింది” అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు జాన్వీ కపూర్ మాట్లాడుతూ..” ఇకపై నేను ఓపెన్ బుక్ లా ఉంటాను. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని బహిరంగంగానే చెబుతాను.. అంటూ బఫెలో ప్లాస్టీ అనే పదంపై ఆమె స్పందించింది. మొత్తానికైతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది జాన్వీ కపూర్. మొత్తానికి అయితే కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆమెకంటూ ఒక హోదాను కల్పించడానికి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే అందంగా ఉండడానికి గతంలో శ్రీదేవి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
ALSO READ:Sara Ali Khan: ఇండస్ట్రీపై సారా సంచలన వ్యాఖ్యలు.. భరించలేనిదంటూ?
ఎన్టీఆర్(NTR ) హీరోగా వచ్చిన ‘దేవరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుచ్చిబాబు సన ,రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాతో పాటు.. నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక అటు బాలీవుడ్ లో పరమ్ సుందరి, సన్నీ సంస్కారికి తులసి కుమారి, హోమ్ బౌండ్ అంటూ బాలీవుడ్ లో వరుసగా మూడు చిత్రాలు చేసింది కానీ అవన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో తక్త్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.