Sara Ali Khan: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. చిత్ర పరిశ్రమలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కానీ.. ఆ ఒత్తిళ్ళ నుండి బయటపడాలి అంటే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి అంటూ తెలిపింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. “భావోద్వేగాలను అణిచివేస్తేనే బలం అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా ఆ బలాన్ని, భావోద్వేగాలను అంగీకరించే ధైర్యం కలిగి ఉండాలి. బాలీవుడ్ పరిశ్రమలో ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి బలంగా ఉండడానికి ప్రతిదీ కూడా మనమే స్వతహాగా చేయాలి అనుకుంటాము. కానీ అలా అనిపించినంత సులభం కాదు చేయడం.. ముఖ్యంగా శరీరాన్ని అన్ని సందర్భాలలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. మనసుని కూడా అంతే ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యమని నేను బాల్యం నుంచే గ్రహించాను.
ఒకప్పుడు నేను చుట్టూ జరుగుతున్న ప్రతి విషయానికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని. ఆ దశలోనే అమ్మతో గడపడం మొదలుపెట్టాను. జీవితంలో చిరునవ్వులు పంచే చిన్న విషయాలు కూడా ఎంత ముఖ్యమో అమ్మ ద్వారానే గ్రహించగలిగాను. అందుకే ఆ చిన్న చిన్న విషయాలే నన్ను నేను తెలుసుకొని తిరిగి పొందేలా సహాయపడ్డాయి. చికిత్స అనేది మానసిక ఆరోగ్య బలహీనతకు సంకేతం కాదు.. అది కూడా మానసిక అభివృద్ధికి , స్వీయ అవగాహనకు ఉపయోగపడే సాధనం లాంటిది. ముఖ్యంగా సహాయం అవసరమైనప్పుడు ఇతరుల నుండి కోరుకోవడం తప్పేమీ కాదు…మనం దానిని ఎంతగా బలపరుస్తామో మానసిక ఆరోగ్యానికి అంత దగ్గరవుతాము. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇవ్వాలి అని భావించినప్పుడే దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా ఆ భావనను మనం తెలుసుకుంటాము. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కంటే శ్రేయస్సు ఇంకొకటి లేదు” అంటూ సారా అలీ ఖాన్ తన స్వీయ అనుభవాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సారా అలీఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ దంపతుల కుమార్తె. కొలంబియా యూనివర్సిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న ఈమె.. 2018 లో రొమాంటిక్ డ్రామా కేదార్నాథ్, సింబ చిత్రాలతో కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె లూకా చుప్పి 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటూ ఏ వతన్ మేరే వతన్ వంటి చిత్రాలలో నటించింది. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అలాగే కేదార్నాథ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్న ఈమె ఆయుష్మాన్ ఖురానాతో మరో సినిమాలో కూడా నటిస్తోంది.
ALSO READ: Bigg Boss 9: లాస్ట్ మినిట్ లో తారుమారు.. పచ్చళ్ల పాపపై కోపం.. ఆమె సేఫ్!