E-Paper
Advertisement

IRCTC Special Trip: రామేశ్వరం TO తిరుపతి, దక్షిణ దర్శనం పేరుతో IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ!

IRCTC Special Trip: రామేశ్వరం TO తిరుపతి, దక్షిణ దర్శనం పేరుతో IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ!
Advertisement

IRCTC Tour Package:

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో చక్కటి టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. శ్రీ రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్ర  పేరుతో దీన్ని పరిచయం చేసింది. 10 రోజుల ప్రత్యేక యాత్ర భారత్ గౌరవ్ రైల్లో కొనసాగనుంది. ఈ పర్యటనలో సౌత్ ఇండియాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. IRCTC రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్ర గురించి..

ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు కొనసాగుతుంది. నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 16న ముగుస్తుంది. ఇది దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రను ఎంజాయ్ చేయాలనుకునే వారికి బాగుటుంది. ఈ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో పర్యాటకులు దర్శించుకునే పుణ్యక్షేత్రాలు ఇవే..

  • తిరుపతి – శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పద్మావతి ఆలయం
  • రామేశ్వరం – రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి
  • మధురై – మీనాక్షి ఆలయం
  • కన్యాకుమారి – వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కన్యాకుమారి ఆలయం
  • తిరువనంతపురం – పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్

ప్యాకేజీ ఛార్జీ ఎంత ఉంటుందంటే?

Advertisement

రామేశ్వరం-తిరుపతి దక్షిణ దర్శన యాత్రకు సంబంధించి ఛార్జీల వివరాలను IRCTC ప్రకటించింది. ఇంతకీ ఎవరికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..  ఈ యాత్రలో పాల్గొనే పెద్దలకు స్లీపర్ క్లాస్  రూ. 18,040, 3AC – రూ. 30,370, 2AC – రూ. 40,240గా నిర్ణయించింది. పిల్లలకు (5-11 సంవత్సరాలు) స్లీపర్ క్లాస్ – రూ. 16,890, 3AC – రూ. 29,010, 2AC – రూ. 38,610గా ఫిక్స్ చేసింది. ఈ ఛార్జీలో భాగంగా రైలు ప్రయాణం, భోజనం, వసతి, స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది.

ప్రయాణికులకు AC, నాన్-AC  ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ హోటళ్లలో సౌకర్యవంతమైన వసతి కల్పించబడుతుంది. లభ్యత, వాతావరణాన్ని బట్టి స్థానిక సందర్శనా స్థలాలను AC, నాన్-AC బస్సుల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా సౌకర్యవంతమైన రైలు ప్రయాణం, శుభ్రమైన హోటళ్లలో వసతి, ప్రయాణం అంతటా స్వచ్ఛమైన శాఖాహార భోజనం, ప్రతి గమ్యస్థానంలో స్థానిక సందర్శనా స్థలాలకు తీసుకెళ్లతారు.

Advertisement

Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!

ఈ యాత్ర కేవలం ఆలయాల దర్శనం మాత్రకే కాదు,  సంస్కృతి, సమాజం, ప్రశాంతతను కోరుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది.  అందమైన మార్గాలు, చారిత్రాత్మక పట్టణాల గుండా ప్రయాణించడం ద్వారా,  దక్షిణ భారత ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని అనుభవిస్తారు. ఈ టూర్ కు సంబంధించిన టికెట్లను  IRCTC వెబ్‌ సైట్ ద్వారా లేదంటే IRCTC  ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నేరుగా బుకింగ్‌ లు చేసుకోవచ్చు.

Read Also: రాజస్థాన్ లో న్యూ ఇయర్ టూర్.. IRCTC ప్లాన్ అదుర్స్ అంతే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×