BigTV English

Tollywood Heroines : సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Tollywood Heroines : సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Advertisement

Tollywood Heroines : అదృష్టం ఎప్పుడు ఎవరిస్తుందో చెప్పడం కష్టం. ఈరోజు చిన్నదిగా ఉన్నదే రేపు మన కెరియర్ ని పూర్తిగా మార్చేస్తుంది అని చాలామంది హీరోయిన్ల కెరియర్ను ఉదాహరణగా చెప్పొచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది యాక్టర్స్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యి సినిమాలో హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


మృణాల్ ఠాకూర్..

మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఆమెకు ఎంత క్రేజీ నందించిందో చెప్పనక్కర్లేదు. తన అంతం అభినయంతో సీత పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఆమె మాట్లాడిన మాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తాకాయి. దాంతో ఆమె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు మొదట హిందీలో సీరియల్స్ చేస్తూ పాపులర్ అయింది.. అర్జున్‌, కుంకుమ్ భాగ్య‌ వంటి సీరియల్స్ చేసింది.

కీర్తి సురేష్..

మహానటి ఈ సినిమా పేరు వినగానే టక్కున గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్.. ఈ అమ్మడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం చాలామందికి తెలియదు. నేను చిన్నప్పుడు సినిమాలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.


ఐశ్వర్య రాజేష్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య రాజేష్.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం తో ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారింది.. ఈమె తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలోకి రాకముందు యాంకర్ గా వ్యవహరించింది. అలాగే కొన్ని సీరియల్స్లలో కూడా నటించింది.

Also Read : వణుకు పుట్టించే హారర్ సీరియల్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

వీళ్లే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆ లిస్టులో ఉన్నారు. నిత్యామీనన్, లేడీ బాస్ నయనతార వంటి స్టార్స్ సైతం సీరియల్స్లలో నటించి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. మృణాల్ ఠాకూర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఐశ్వర్య రాజేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే నయనతార హీరోయిన్స్ అందరిలో కల్లా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా సినిమాలు చేస్తుంది.. ఈ హీరోయిన్లందరూ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Related News

Akhanda 2: ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Big Stories

×