E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఘనంగా జాన్వీకపూర్ సోదరి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. కాక్ టెయిల్ పార్టీ ఎప్పుడంటే?

ఘనంగా జాన్వీకపూర్ సోదరి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. కాక్ టెయిల్ పార్టీ ఎప్పుడంటే?
Advertisement

Bollywood:2026 ప్రథమార్ధం దక్షిణాది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడితే.. ఇప్పుడు అదే 2026 ద్వితీయార్థంలో ఉత్తరాదిన సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా.. నేడు తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకున్న జాన్వీ కపూర్ సోదరి పెళ్లికి సిద్ధమయింది. ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతులలో పాల్గొని సందడి చేసిన జాన్వీ కపూర్.. ఇప్పుడు సోదరి చెల్లి పెళ్లికి సిద్ధం అయిపోయింది. ఈ మేరకు జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ అసలు విషయాన్ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

జాన్వీ కపూర్ సోదరి పెళ్లి ముహూర్తం ఫిక్స్..

ఇకపోతే జాన్వీ కపూర్ సోదరి అనగానే మనకు ప్రముఖ హీరోయిన్ ఖుషీ కపూర్ గుర్తుకొస్తారు. కానీ బోణీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియుడు, ప్రముఖ స్క్రీన్ రైటర్, దర్శకుడు రోహన్ థక్కర్ తో ఆమె ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాత బోనీకపూర్ స్పందిస్తూ.. అన్షులా, రోహన్ జూలై 6వ తేదీన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ అధికారికంగా ప్రకటించేశారు. ఈ మేరకు ఈ వివాహం రెండు వర్గాల కలయికతో ఒకే రోజులో పూర్తవుతుంది అంటూ స్పష్టం చేశారు. ఇక వివాహానికి ముందు జరిగే వేడుకల కోసం కపూర్ కుటుంబం మొత్తం ఒక్కటయింది. ఈ ఆనందకరమైన సందర్భంలో తోబుట్టువులైన అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, వీరి కజిన్ షనయా కపూర్ కూడా ఈ వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

ఆకట్టుకున్న జంట..

Advertisement

నిర్మాత బోణీ కపూర్ , దివంగత మోనా శౌరీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్. పెళ్లికి సిద్ధమవుతున్న వేళ ఇటీవల ఆమె ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకుంది. అందులో ఎరుపు , మెజెంటా దుపట్టాతో జతచేసిన బంగారు రంగు లెహంగాను ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక రోహన్ మెరూన్ షేర్వానీలో ఈమెకు జతగా నిలిచారు. మొత్తానికైతే ఇప్పుడు జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జూలై ఆరవ తేదీన వివాహం అనంతరం కాక్ టెయిల్ పార్టీని కూడా నిర్వహించనున్నారు.

కాక్ టెయిల్ పార్టీకి కొత్త నియమాలు..

ఈ మేరకు అందుతున్న సమాచారం ప్రకారం.. వివాహ వేడుక ముగిసిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ పార్టీతో వేడుకలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా అతిధులను ఆధునిక భారతీయ దుస్తుల నియమావళిని పాటించమని బోనీకపూర్ కుటుంబం కోరినట్లు సమాచారం.

Advertisement

also read:సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

ఆన్ లైన్ లో మొదలైన ప్రేమ కథ.. పెళ్లికి పునాది..

వీరి ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయానికి వస్తే.. అన్షులా, రోహన్ ఇద్దరూ ఒక డేటింగ్ యాప్ లో పరిచయం పెంచుకొని ఆ తర్వాత ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అర్ధరాత్రి సంభాషణల ద్వారానే ఒకరికొకరు దగ్గరైనట్లు సమాచారం. సంవత్సరాల తరబడి స్నేహంలో మునిగితేలిన ఈ జంట చివరికి 2025 జూలైలో న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్కులో రోహన్ అన్షులాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 2025 అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకోగా.. ఆ ప్రపోజల్ కు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా అన్షులా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

అన్షులా కెరియర్..

అన్షులా విషయానికొస్తే.. ఈమె ఫౌండర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, సోషల్ మీడియా పర్సనాలిటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అటు రోహన్ స్క్రీన్ రైటర్ , దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు.

Related News

దుల్కర్ సల్మాన్ కు చుక్కెదురు..కార్ స్మగ్లింగ్ కేసులో అలాంటి ప్రశ్నలు!

సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

రామాయణ టీమ్ కి భారీ షాక్.. 11 సెకండ్ల వీడియో లీక్!

Theater Releases : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..

Hero Nani : హీరో నాని చేతికి గాయాలు.. షాక్ లో ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..?

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!

పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?

Big Stories

×