BigTV English

Abbas: అమ్మాయిల కలల రాకుమారుడు.. మళ్లీ వస్తున్నాడు

Abbas: అమ్మాయిల కలల రాకుమారుడు.. మళ్లీ వస్తున్నాడు

Abbas: ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ, కొంతమంది హీరోలు మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఉంటారు. అలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే ఎన్నేళ్లు అయినా కూడా కొంతమంది హీరోలు అమ్మాయిల కలల రాకుమారుడుగానే గుర్తుండిపోతారు.  అలాంటి హీరోల గురించి చెప్పాలంటే తెలుగులో నాగార్జున.. తమిళ్ లో మాధవన్.. ఆ తరువాత  అబ్బాస్.  కేవలం వీరు మాత్రమే ఎన్నేళ్లయినా కూడా అమ్మాయిల కలల రాకుమారుడు అని పదానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


 

ప్రస్తుతం నాగార్జున, మాధవన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే అబ్బాస్ మాత్రం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.  ప్రేమదేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు అబ్బాస్. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అబ్బాస్. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందించడంతోపాటు అబ్బాస్ అనే కుర్ర హీరోని తెలుగు తెరకు పరిచయం చేసింది. నున్నటి ముఖం, కళ్ళ మీద పడే జుట్టు, కండలు తిరిగిన దేహం అబ్బాస్ సొంతం. అతనిని చూడగానే అమ్మాయిలు తమకు అలాంటి భర్తనే రావాలని కోరుకునే వారట. ఇక అబ్బాయిలు సైతం ఎక్కువగా అబ్బాస్ కటింగ్ చేయించుకొని అతడిలా అమ్మాయిల ముందు ఫోజులు కొట్టేవారు అంటే అతిశయోక్తి కాదు.


 

ఇక ప్రేమదేశం సినిమా ఇచ్చిన హిట్టుతో అబ్బాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగాడు. 2015లో పచ్చకాలం అనే సినిమా తర్వాత అబ్బాస్ ఇండియాలోనే ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయ్యాడని సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు.  ఇక సోషల్ మీడియా వచ్చాక అప్పుడప్పుడు అబ్బాస్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ వచ్చాడు. ఒక సర్జరీ తర్వాత అబ్బాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చాలామంది ఆయనకు హెల్ప్ చేయాలని ప్రయత్నించారు. ఇక తనకు ఒక చిన్న సర్జరీ జరిగిందని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ,త్వరలోనే ఇండియా వస్తానని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.

 

ఇక అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే ఉండడంతో ఆయన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.దీనివల్ల అబ్బాస్ కు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి . మంచి కథలు దొరికితే తాను కూడా తిరిగి నటిస్తాను అని చెప్పిన  అబ్బాస్ ఎట్టకేలకు 11 ఏళ్ల తరువాత  రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు.  కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్  హీరో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో అబ్బాస్ కీలకపాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. మరియా రాజా ఎలెంచెజియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అబ్బాస్ పాత్ర చాలా కీలకమని, ఎంతో స్టైలిష్ గా కనిపించనున్నాడని సమాచారం. ఆ సినిమా షూటింగ్  కోసమే న్యూజిలాండ్ నుంచి అబ్బాస్ ఇండియాకి వచ్చాడు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×