Ind vs SL: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఇవాళ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా… టీమిండియా మహిళల జట్టు వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ తొలి పోరు జరిగింది. అయితే ఈ తొలి మ్యాచ్ లోనే టీమిండియా అదరగొట్టింది. వాస్తవంగా శ్రీలంక గెలుస్తుంది అనుకున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి… జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఏకంగా 59 పరుగుల తేడాతో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా.
Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్…Final Match, What’s Happening…అంటూ
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో… టీమిండియా కు తొలి విజయం దక్కింది. 269 పరుగుల టార్గెట్ పెట్టిన టీమిండియా… బౌలర్ల కారణంగా దాన్ని కాపాడుకుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోతే… వాళ్లను కట్టడి చేశారు టీమిండియా బౌల్లర్స్. దీంతో 45.4 ఓవర్లలో 211 పరుగులకు శ్రీలంక కుప్పకూలింది. ఈ తరుణంలోనే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగానే రాణించారు. మ్యాచ్ లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కు వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికి వర్షం పడింది. దీంతో ఈ మ్యాచ్ 47 ఓవర్లకు కుదించారు అంపైర్లు. అయినప్పటికీ టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన టీమిండియా మహిళల జట్టు 269 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్.. కాస్త తడబడడంతో… భారీ స్కోర్ నమోదు కాలేదు. దానికి తోడు మధ్యలో వర్షం పడడంతో… పిచ్ మొత్తం బౌలర్లకు అనుకూలించింది.
ఇక టీమిండియా బ్యాటర్ల విషయానికి వస్తే… ప్రతీక రవల్ 37 పరుగులు చేయగా… స్మృతి మందాన ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యారు. అలాగే హర్లిన్ డియోల్ 48 పరుగులతో రాణించారు. ఇందులో ఏకంగా ఆరు బౌండరీలు సాధించారు హర్లిన్. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హార్మిత్ కౌర్ రాణించే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్ లో 21 పరుగులు చేసిన కెప్టెన్ హర్మిత్.. ఆ తర్వాత అనూష కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన జెమ్మి.. డకౌట్ అయింది. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఆర్డర్లో వచ్చిన మరో ప్లేయర్ దీప్తి శర్మ 53 బంతుల్లో 53 పరుగులు చేసి టీమిండియాను ఆదుకుంది. ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి. 100 స్ట్రైక్ రేట్ తో ఆమె దుమ్ము లేపారు. చివర్లో ఆమంజోథ్ కౌర్… అదిరిపోయే బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియాకు ఊపిరి పోసారు. ఆమె 57 పరుగులు చేయగా స్నేహరాన 28 పరుగులతో… నాటౌట్ గా నిలిచారు.
Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే