Nivetha Pethuraj : కొలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఈమె రీసెంట్ గా పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పలకరించింది.. అది మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే..
లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, తనకు సొసైటీలో ఎదురైన సమస్యల గురించి కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. మొన్న ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది. అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ఓ వార్త షికారు చేస్తుంది. తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసింది. దాంతో ఈ వార్త నిజమేనని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ వ్యక్తి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బిజినెస్ మ్యాన్ తో నివేదా పెళ్లి..?
సినిమాలతో, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయాన్ని బయటపెట్టింది. అయితే అతని చేతిలో మోసపోయానని చెప్పింది. అవి ఇండస్ట్రీలో ఎంతగా హాట్ టాపిక్ గా మారయో అందరికీ తెలిసిందే. అప్పట్లో పెళ్లి అనే మాట రానివ్వను అని ఓ సందర్భంలో చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసింది. అతను ఓ బిజినెస్ మాన్ అని నెట్టింట ప్రచారంలో ఉంది.. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా జంట బాగుంది అంటూ అందరూ లైక్లు కొడుతున్నారు.మరి దీనిపై ఈ ముద్దుగుమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read :మీనాను అవమానించిన రోహిణి.. మనోజ్ దెబ్బకు చెమటలు.. రౌడీగా మారిన బాలు..
నివేదా నటించిన సినిమాలు..
కోలీవుడ్‌లో నివేదా పేతురాజ్ ‘ఒరునాల్ కూత్తు’, ‘పొదువాగ ఎన్‌మనసు’, ‘టిక్ టిక్ టిక్’ వంటి అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో సుశాంత్‌కి లవర్‌గా ఆమె నటించింది. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌లతో బిజీ నటిగా గడుపుతోంది. ఇక తెలుగులో మరో ప్రాజెక్టు లో నటించనుందని సమాచారం.. త్వరలోనే ఆ ప్రాజెక్టు గురించి వివరాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వెబ్ సిరీస్ లపై ఈ అమ్మడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంది..