E-Paper
Advertisement

‘పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే నరకం చూశాను’.. ఎమోషనల్ అయిన జయం రవి..

‘పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే నరకం చూశాను’.. ఎమోషనల్ అయిన జయం రవి..
Advertisement

Jayam Ravi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి తాజాగా ఒక ప్రెస్ మీట్ లో తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భార్య కుటుంబం నుండి తాను ఎదుర్కొన్న చిత్రహింసలను బయటపెట్టారు. ఇప్పటికే తన ప్రేయసి కూడా తనను విడిచి పెట్టి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.

Read also-రామ్ చరణ్ చేతికి గాయం ఇప్పటిది కాదా?.. అయినా సరే ‘పెద్ది’ కోసం..

ఆ ఇంట్లో నరకం

Advertisement

గత 23 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎలాంటి మచ్చ లేకుండా బతికా నని, కానీ తన మాజీ భార్య ఇంట్లో తనకు కనీస గౌరవం, ప్రశాంతత లేకుండా పోయాయని జయం రవి కన్నీరు పెట్టుకున్నారు. పెళ్లయిన మొదటి రోజు నుండి బ్లాక్‌మెయిల్స్‌తోనే జీవితం సాగిందని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బు దాచుకోవడానికి తన పేరిట ఒక్క సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు పెట్టి కట్టిన ఇంటిని వదిలేసి, ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. అలాగే, తన పిల్లలను కూడా తనను చూడనివ్వకుండా దూరం చేస్తున్నారని వాపోయారు.

బ్లాక్ మేజిక్ చేశారు..

తమ ఇంట్లో ఉన్నప్పుడు తనను పూర్తిగా అణచి ఉంచడానికి, ఒక పొట్టిపాములా మార్చడానికి బ్లాక్ మేజిక్ చేశారని జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్లే ఇప్పుడు తనకు రక్తం వాంతులు అవుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. తనను మానసికంగా, శారీరకంగా చంపేయడానికి ఒక కూటమిలా ఏర్పడి ప్రయత్నిస్తున్నారని, అయితే అందరి సంగతి తేల్చాకే తాను విశ్రమిస్తానని స్పష్టం చేశారు,.

సైబర్ బుల్లింగ్‌పై

Advertisement

తన స్నేహితురాలు కెనిషాపై తనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. కొందరు ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం ఒకరి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సైబర్ బుల్లింగ్ కారణంగా ఎంతోమంది యువతీ యువకులు, సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి వారిని తాను చట్టపరంగా అస్సలు వదిలిపెట్టనని హెచ్చరించారు. తన వద్ద అన్ని అన్యాయాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయన్నారు.

Read also-సామాన్యుడికి దూరమవుతున్న వెండితెర!.. ఐపీఎల్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..

సినిమాలకు తాత్కాలిక విరామం

ప్రస్తుత మానసిక పరిస్థితుల్లో తాను కెమెరా ముందుకు వచ్చి నటించలేనని జయం రవి ప్రకటించారు. “ప్రస్తుతానికి నేను నటించడం లేదు. నా పర్సనల్ లైఫ్‌ను క్లీన్ చేసుకుని, నా ఇమేజ్‌ను కాపాడుకున్న తర్వాతే మళ్లీ సినిమాల్లోకి వస్తాను. అంతవరకు అభిమానులు ఓపికగా ఉండాలి” అని కోరారు. ఈ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన తోటి నటులు కార్తీ, ప్రభుదేవా వంటి వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×