E-Paper
Advertisement

‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!

‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!
Advertisement

Johnny Clarification: నిన్నటి నుండి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరింది అన్నవార్తలపై సోషల్ మీడియా లో సర్క్యులేట్ అవుతున్న ప్రచారానికి పుల్ పెట్టేందుకు జానీ మాస్టర్ మరియు అతడి భార్య, డాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు.అసలు మధ్య ఎదో జరిగిపోయింది, కొట్టుకున్నాం అనే దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఇదంతా కొందరు అల్లిన కట్టుకథ అంటూ కొట్టిపారేసారు జానీ దంపతులు.

వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు 

Advertisement

ఇక ఇదే మీడియా సమావేశంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నిన్న మా యూనియన్ సమస్యలపై మాలో మాకు చర్చలు జరిగాయని, అయితే తనకూ, శేఖర్ మాస్టర్‌కూ మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తామందరం అన్నతమ్ముళ్ళ లాగా ఉంటామని , ఇక్కడ అందరూ మంచి వ్యక్తులేనని, ప్రతి ఒక్కరం యూనియన్ మంచి కోసమే కష్టపడతామని తెలిపారు.

also read :గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

Advertisement

చిరంజీవి సైతం ఆరా

ఈ యూనియన్ వివాదాలపై వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరా తీసినట్లు జానీ మాస్టర్ వెల్లడించారు. ఇటీవల చిరంజీవి గారి సినిమా షూటింగ్‌లో తాను, శేఖర్ మాస్టర్ కలిశామని, ఆ సమయంలో చిరంజీవి గారు ఈ వార్తల గురించి అడిగారని చెప్పారు. షూటింగ్ గ్యాప్ లో తామంతా కూర్చొని పాత పాటల గురించి ఎంతో సరదాగా మాట్లాడుకున్నామని తెలిపారు. చిరంజీవి గారే తమ అందరికీ ఎనర్జీ, స్పూర్తి అని, తమ ప్రతిభను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఒక్క చిరు సారే కాదు, పరిశ్రమలోని హీరోలందరూ, మాస్టర్లందరూ తమకు సపోర్ట్‌గా నిలుస్తారని తెలిపాడు జానీ మాస్టర్ .

క్లారిటీ ఇఇచ్చిన జానీ మాస్టర్ 

చివరగా, యూనియన్‌లో వచ్చే చిన్న చిన్న సమస్యలపై తమలో తమకి డిస్కషన్స్ జరగడం సహజమేనని, వీటికి శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. అనవసర పుకార్లను నమ్మవద్దని, డ్యాన్సర్స్ అసోసియేషన్ అంతా ఒక్కటిగానే ఉంటూ సభ్యుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అధ్యక్షురాలు సుమలతా దేవి, జానీ మాస్టర్ ఈ ప్రెస్‌మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

also read :జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

Related News

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్.. వాగ్వాదంపై స్పందించిన జానీ!

గతాన్ని డిలీట్ చేయొచ్చు.. ప్రేమని కాదా? హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షర హాసన్ ‘సిమ్యులాక్రా’!

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×