Film industry:సినిమా ఇండస్ట్రీలో పని చేసే వ్యక్తుల మధ్య విభేదాలు రావడం సహజమే. అయితే ఆ విభేదాలు వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో లేదా ఒకరికొకరు ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారితో కలవడానికి, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అయితే ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా ఒక అడుగు ముందుకేసింది. ఒకప్పుడు అతడితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించి అద్భుతాలు సృష్టించిన ఆమె ..ఇప్పుడు మళ్లీ అతనితో నటించడానికి వెనుకంజ వేస్తోంది. అంతేకాదు అడుక్కొని తినడానికైనా వెనుకాడను కాని అతడితో మాత్రం సినిమాలు చేయను అంటూ కరాకండిగా చెప్పేస్తోంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు.. ప్రముఖ నటి సోనా హైడెన్. తెలుగు, తమిళ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మంచి పేరు దక్కించుకున్న ఈమె.. ప్రముఖ హాస్య నటులు వడివేలు, సునీల్ తో ఎన్నో చిత్రాలలో నటించి, అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి సోనా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో ప్రముఖ తమిళ సీనియర్ హాస్యనటుడు వడివేలుపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. తనను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని, ఆ నరకం అనుభవించలేక అతనితో సినిమాలు చేయడం మానేశాను అని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ వడివేలు పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది సోనా.
వడివేలు నటనను ఒకవైపు ప్రశంసిస్తూనే.. మరొకవైపు ఆయన వ్యక్తిత్వాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టింది. ” వడివేలు అద్భుతమైన హాస్యనటుడు.. బాడీ లాంగ్వేజ్ తో అద్భుతమైన హస్యాన్ని పండించే ఆయనకు ఎవరూ సాటి రారు. కానీ ఆయన మంచి మనిషా? అనే ప్రశ్న వస్తే మాత్రం నేనేమీ చెప్పదలుచుకోలేదు” అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా వడివేలుతో కలిసి 16 సినిమాలలో నటించే అవకాశం లభించినప్పటికీ.. స్వయంగా ఆమె వాటిని తిరస్కరించానని చెప్పింది . ఎందుకు అనే కారణాన్ని కూడా సోనా వివరిస్తూ.. సినిమాలలో అవకాశాల కంటే కూడా నా ఆత్మగౌరవం ,హుందాతనమే నాకు ముఖ్యం.నా గౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు.
ALSO READ:హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!
ముఖ్యంగా రోడ్డు పక్కన కూర్చొని బిక్షం ఎత్తుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఇలా ఆత్మ గౌరవాన్ని చంపుకొని చేసే పనులు నాకు వద్దు.. అలాంటి డబ్బు అసలుకే వద్దు” అంటూ ఘాటుగా స్పందించింది. ఒకప్పుడు అదే వడివేలుతో మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించి ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయంపై సోనా స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఇద్దరి మధ్య ఏదో వ్యక్తిగతంగా సమస్యలు తలెత్తాయి అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి . మరి ఈ గందరగోళానికి తెర పడాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు దీనిపై స్పందించక తప్పదు.