E-Paper
Advertisement

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!
Advertisement

Sunita Comments: బీ టౌన్ లో ఎప్పుడు ఏ న్యూస్ ఎలా వైరల్ అవుతుందో తెలీదు. ఇక తాజాగా ‘లాక్ అప్’ రియాలిటీ షోలో గోవిందా భార్య సునీతా అహుజా చేసిన కామెంట్స్ కూడా ఇపుడు అలానే వైరల్ అవుతుంది. ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా చేస్తున్న ఈ పాపులర్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె తన కామెంట్స్ కి కట్టుబడే ఉన్నానని తెగేసి చెప్పడం ఇక్కడ
విశేషం.

తన భర్తకు ఎన్ని అఫైర్స్ ఉన్నా తాను అస్సలు వదులుకోనని, ముఫ్ఫై ఏళ్లకు పైగా సాగిన తమ సంసార జీవితం చాలా గట్టిదని కుండబద్దలు కొట్టేసింది. ఒక భార్య స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరని, ఆ నమ్మకమే తనను నడిపిస్తోందని ఓపెన్ గానే చెప్పేస్తుంది.

Advertisement

50 అఫైర్స్ ఉన్నా అది తమ పర్సనల్ మ్యాటర్

సునీతా మాట్లాడుతూ తన భర్తకి 50 అఫైర్స్ ఉన్నా అది తమ పర్సనల్ మ్యాటర్ అని , అయితే గోవిందాకి అలా అఫైర్స్ ఉన్నా తనకెలాంటి పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టేసింది .ఇక సునీతా అహుజా ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా ‘లాక్ అప్’ షో రేటింగ్‌ లు ఒక్కసారిగా దూసుకుపోవడం విశేషం.ఈ షో విషయానికి వస్తే 2022లో కంగనా రనౌత్ హోస్ట్‌గా, కరణ్ కుంద్రా జైలర్‌గా మొదలైన ఈ షోలో మొదటి సీజన్ లో మునావర్ ఫారూఖీ టైటిల్ విన్నర్ అయిన సంగతి తెల్సిందే.ఇక సరికొత్తగా వస్తున్న ఈ రెండో సీజన్ లో 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా సునీతా గోవిందాపై చేసిన కామెంట్స్ షో పై ఎక్కడ లేని అంచనాలు పెంచేశాయ్.

Advertisement

1986లో వచ్చిన ‘ఇల్జామ్’ తో హిందీ తెరపైకి ఎంట్రీ

గోవిందా విషయానికి వస్తే 1980, 90ల కాలంలో బాలీవుడ్‌ను తనదైన కామెడీ టైమింగ్ తో ఏలాడనే చెప్పాలి.1986లో వచ్చిన ‘ఇల్జామ్’ తో హిందీ తెరపైకి ఎంట్రీ ఇచ్చిన గోవిందా ఆ తర్వాత ‘కూలీ నెం. 1’, ‘రాజా బాబు’, ‘హీరో నెం. 1’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ లీగ్ లోకి దూసుకుపోయాడు.ఇక  కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 1987లో సునీతని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు గోవిందా. అయితే కెరీర్ దెబ్బ తింటుందన్న భయంతో దాదాపు రెండేళ్ల పాటు ఈ పెళ్లి విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు.ఇక వీరి సంసారానికి గుర్తుగా టీనా అహుజా, యశ్‌వర్ధన్ అహుజా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

వీటికి గోవిందా ఎలాంటి రిప్లయ్ ఇస్తాడో !

అయితే అప్పట్లో స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీతో గోవిందా అఫైర్ నడిపారంటూ అప్పట్లో బీ టౌన్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టడం కూడా అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు . ఏది ఏమైనా సునీతా ఇలా మరోసారి గోవిందా అఫైర్స్ సంగతిని మరోసారి బయటపెట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది బాలీవుడ్. చూడాలి వీటికి గోవిందా ఎలాంటి రిప్లయ్ ఇస్తాడో !

also read :జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×