E-Paper
Advertisement

గతాన్ని డిలీట్ చేయొచ్చు.. ప్రేమని కాదా? హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షర హాసన్ ‘సిమ్యులాక్రా’!

గతాన్ని డిలీట్ చేయొచ్చు.. ప్రేమని కాదా? హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షర హాసన్ ‘సిమ్యులాక్రా’!
Advertisement

Simulacra OTT: ‘సిమ్యులాక్రా’ (Simulacra)…కమల్ హసన్ చిన్న కూతురు అక్షర హాసన్, సత్యజీత్ దూబే లీడ్ రోల్స్ లో నటించిన సినిమా.పంకజ్ సావంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైబర్ థ్రిల్లర్ జూలై 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘వేవ్స్’ (Waves OTT) లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.ఈ డిజిటల్ యుగంలో మన జీవితాలని శాసిస్తున్న టెక్నాలజీ గనుక మన రీరైట్ చేయగలిగితే ఎలా ఉంటుందనే సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో వస్తుండడం విశేషం.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సంచలనం స్ప్రుష్టిస్తుంది.

అక్క శృతి హసన్ లా వరుస పెట్టి సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుపోతుంది అక్షర హాసన్.అలా చేసిన సినిమాలే గతంలో ‘షమితాబ్’, ‘వివేగం’.ఇక తాజాగా అదే క్రమంలో చేసిన ‘సిమ్యులాక్రా’ (Simulacra) అనే సినిమాలో’నివి’ అనే సరికొత్త లేయర్డ్ క్యారెక్టర్‌లో కనిపించనుందట ఈ కమల్ డాటర్.

Advertisement

ఎమోషన్స్‌తో కూడిన మైండ్ గేమ్స్

ఇక ఈ సందర్భంగా అక్షర మాట్లాడుతూ ఒక నటిగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టేందుకు ఎమోషన్స్‌తో కూడిన మైండ్ గేమ్స్ పండించేందుకు ఈ రోల్ తనకు ఎంతో హెల్ప్ అయిందని చెప్పుకొచ్చింది.కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేయకుండా మెచ్యూరిటీతో నటించేందుకు ఈ సినిమా తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది.

Advertisement

కథ ప్రకారం, భవిష్యత్ కాలంలో మానవ మెదడులో న్యూరల్ చిప్స్ అమర్చి, జ్ఞాపకాలను డిలీట్ చేయడం లేదా మార్చడం వంటివి చేసే కార్పొరేట్ టెక్నాలజీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. ట్రాన్స్-హ్యూమనిజం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఈ కథలో నివి అనే అమ్మాయికి, నయన్ అనే అబ్బాయికి మధ్య జరిగే సైకలాజికల్ డ్రామానే ఈ చిత్రమని ఇప్పటికే చెప్పుకొచ్చాడు డైరెక్టర్ పంకజ్ సావంత్.

ఒక వ్యక్తితో గతాన్ని రీక్రియేట్ చేసే క్రమంలో

నయన్‌గా నటించిన సత్యజీత్ దూబే తన మెదడులోని మెమరీ వాల్ట్ ఆధారంగా నివితో తనకు పాత పరిచయం ఉందని, తామిద్దరం ప్రేమించుకున్నామని కొన్ని ఆధారాలను చూపిస్తాడు. కానీ నివి మెదడులోని మెమరీ చిప్ మాత్రం పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఉంటుంది. తనకు అస్సలు గుర్తులేని ఒక వ్యక్తితో గతాన్ని రీక్రియేట్ చేసే క్రమంలో వారి మధ్య పుట్టే ఎమోషన్సే ఈ సినిమా.ఇక ఈ సినిమా గురించి సత్యజీత్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాలంలో ఇలాంటి కథలు రావడం చాలా ఒక నటుడిగా చాలా సంతృప్తిని ఇస్తాయని చెప్పుకొచ్చాడు.సినిమా పరంగా వర్చువల్ రియాలిటీకి, రియల్ లైఫ్‌కి మధ్య ఉన్న సనన్ని గీతని ఈ సినిమాలో మెయిన్ గా డిస్కస్ చేయనున్నాడు డైరెక్టర్ .

మూవీ లవర్స్ కి ఒక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్

చూడాలో మరి టెక్నాలజీ మనుషుల ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేస్తోంది అనే పాయింట్‌ను పంకజ్ సావంత్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఎలా డీల్ చేశాడో !ఏది ఏమైనా ఈ జూలై 17న స్ట్రీమింగ్ కానున్న ‘సిమ్యులాక్రా’ మూవీ లవర్స్ కి ఒక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పక్కతప్పదు !

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×