E-Paper
Advertisement

అమ్మాయి కదాని సొళ్ళు కారిస్తే… కనికరం లేకుండా ఇదేం పని భయ్యా ? నిద్ర కరువయ్యే ట్విస్ట్

అమ్మాయి కదాని సొళ్ళు కారిస్తే… కనికరం లేకుండా ఇదేం పని భయ్యా ? నిద్ర కరువయ్యే ట్విస్ట్
Advertisement

Sci Fi Horror Movie: రోడ్డుపై అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే… వేలు చూపించి లిఫ్ట్ కావాలని హెల్ప్ అడిగితే… మంచి మనసున్న మగ మహారాజు ఎవరైనా సరే ఠక్కున కారు లేదా బైక్ ను ఆపి, లిఫ్ట్ ఇస్తారు. ఇంకొంత మంది అమ్మాయి కదా అని సొళ్ళు కారుస్తూ లిస్ట్ ఇస్తారు. కానీ ఇలా లిఫ్ట్ ఇవ్వడం ప్రాణాలనే తీస్తుందని కనీసం ఎవరైనా ఊహించగలరా ? అవును, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఇదే జరుగుతుంది. ‘అండర్ ది స్కిన్’ (Under the Skin) అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? దీని కథ ఏంటి ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ స్కాట్‌లాండ్ నగరంలో సాగుతుంది. అక్కడ ఒక అపరిచిత మహిళ రోడ్లపై తిరుగుతుంది. ఆమెనే మన హీరోయిన్. ఆ అమ్మాయి తెల్లటి వ్యాన్ వేసుకుని, హైవేపై తిరుగుతూ ఉండటంతో స్టోరీ మొదలవుతుంది. నిజానికి ఆమె మనిషి కాదు, ఒక మానవ మహిళ శరీరాన్ని ధరించిన గ్రహాంతరవాసి. ఆమె రోడ్లపై ఒంటరిగా తిరిగే పురుషులను తన అందంతో, మాటలతో ఆకర్షించి తన వ్యాన్‌లోకి ఎక్కించుకుంటుంది.

Advertisement

తరువాత ఏం చేస్తుందో తెలిస్తే ప్యాంటు తడిచిపోవడం ఖాయం. అలా అట్రాక్ట్ చేసి, వ్యాన్ లో ఎక్కించుకున్న వారిని చీకటిగా ఉండే సీక్రెట్ ప్లేస్ కు తీసుకువెళ్తుంది. అక్కడ ఆ అబ్బాయిలు ఒక నల్లటి ద్రవంలో మునిగిపోతారు. ఆ ఎలియన్స్ మానవుల చర్మాన్ని, మాంసాన్ని తమ అవసరాల కోసం సేకరిస్తుంటారు. ఇలా వేట సాగిస్తున్న క్రమంలోనే ఆమె వలలో ఒక వికలాంగుడు పడతాడు. అతని అమాయకత్వం, సమాజం అతని పట్ల చూపే వివక్షను చూసి ఆమెలో మొదటిసారి ‘జాలి’ అనే మానవ సహజమైన గుణం పుట్టుకొస్తుంది.

ఇదంతా చూసి దయతో అతన్ని చంపకుండా వదిలేస్తుంది. ఈ సంఘటనతో ఆమెలో ఎమోషన్స్, రుచులు, భయాలు వంటివి అచ్చం మనిషిలాగే ఆమెకు అలవడటం స్టార్ట్ అవుతుంది. మనుషులతో గడపడం వల్ల ఆమెకు మనుషుల లాంటి ఎమోషన్స్ అలవడతాయి. దీంతో తన స్వజాతికి చెందిన వారిని దూరం పెట్టి, వాళ్ళు పట్టుకోలేని విధంగా పారిపోతుంది. అలా ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక స్థానిక వేటగాడు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమెపై అఘాయిత్యం చేయబోతుండగా, ఆ ఘర్షణలో ఆమె మానవ చర్మం చిరిగిపోతుంది. దీంతో లోపల ఉన్న నల్లటి గ్రహాంతర రూపం అతనికి కనిపిస్తుంది. చివరకు ఆ భయంకరమైన రూపం ఎలాంటి టర్న్ తీసుకుంది ? బాధకరమైన ఆ క్లైమాక్స్ ఏంటి ? అతన్ని ఆ ఏలియన్ చంపేసిందా ? లేదంటే ఆమె నమ్మిన మనిషే ఆ ఏలియన్ ను కనికరం లేకుండా ఏమైనా చేశాడా ? అన్నది ఈ సినిమా స్టోరీ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

Advertisement

‘అండర్ ది స్కిన్’ మెంటలెక్కించే సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ. ఈ ప్రయోగాత్మక చిత్రంలో డైలాగులు తక్కువగా ఉంటాయి. కానీ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటాయి. 2013లో విడుదలైన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ చిత్రానికి జోనాథన్ గ్లేజర్ దర్శకత్వం వహించగా, స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించారు. మిషెల్ ఫాబెర్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం భారతదేశంలో అధికారికంగా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం లేదు. రెంటల్ ఆప్షన్ ద్వారా Apple TV లేదా Google Play Moviesలో వీక్షించవచ్చు. మరి మానవ చర్మం కింద దాగి ఉన్న ఈ సీక్రెట్ అండ్ మైండ్-బెండింగ్ మూవీపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Read Also: చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×