E-Paper
Advertisement

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!
Advertisement

Varun Tej:ప్రిన్స్ మెగా హీరో వరుణ్ తేజ్ తొలిసారి తన కెరియర్లో జానర్ మార్చి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కొరియన్ కనకరాజు. ప్రేమికుడిగా, ఫ్యామిలీ మెన్ గా , మాస్ హీరోగా ఇలా విభిన్న షేడ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తాజాగా హారర్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి ఆగస్టు 7వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది. మరి కొరియర్ కనకరాజు నుండి విడుదల చేసిన టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్..

ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కొరియన్ కనకరాజు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్ రఫ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. టీజర్ విషయానికి వస్తే.. “మాది రాయలసీమ.. మా ఊరు పెనుగొండ.. కనకరాజు గాడికి బలమైన కారణం ఉంటే తప్ప మందు ముట్టడు” అనే డైలాగ్స్ తో టీజర్ ప్రారంభమవుతుంది. కమెడియన్ సత్య, వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్ కే హైలెట్గా నిలిచాయి. కట్ చేస్తే.. హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషలో మాట్లాడుతూ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత కొరియన్ సింబల్ తో ఉన్న ఒక బాటిల్ ఓపెన్ అవడం.. వెంటనే వరుణ్ తేజ్ లో మార్పులు రావడం.. కళ్ళు నీలం రంగులోకి మారిపోయి, హారర్ టోన్ ని ఎలివేట్ చేయడం అన్నీ ఆకట్టుకున్నాయి. హారర్ కామెడీతో టీజర్ ఫ్లోలో వెళ్తుంటే కట్ చేస్తే చివర్లో పవన్ కళ్యాణ్ ఓజీ స్టైల్లో సడన్ గా గ్యాంగ్ స్టర్ లుక్కులో ఎంట్రీ ఇచ్చి టీజర్ లో ఊహించని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ చిత్రానికి తమన్ బీజీఎం కామెడీ హారర్ థీమ్ తో చాలా కొత్తగా అనిపించింది.

Advertisement

ALSO READ:జురాసిక్ పార్క్ నటుడు మృతి..మరణానికి కారణం?

వరుణ్ తేజ్ హిట్టు కొడతారా?

ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యు వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజీవ్ రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండో కొరియన్ సంస్కృతిని హారర్ కామెడీ అంశాలతో మేళవిస్తూ ఒక విభిన్నమైన , వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆయనకు స్టార్ డం లభించలేదు. ఇప్పుడు రూటు మార్చి హారర్ కామెడీ జానర్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా సక్సెస్ అందిస్తుందా? లేదా? అన్న విషయం తెలియాలి అంటే ఆగస్టు 7 వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

 

Related News

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?

జురాసిక్ పార్క్ నటుడు మృతి..మరణానికి కారణం?

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

Big Stories

Advertisement
×