E-Paper
Advertisement

జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్.. వాగ్వాదంపై స్పందించిన జానీ!

జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్.. వాగ్వాదంపై స్పందించిన జానీ!
Advertisement

Jani Master:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు తెచ్చుకొని.. పరస్పరం మంచి సాన్నిహిత్యంతో కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు అంటూ వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్లో జరిగిన ఆ గొడవకు తాలూకా వీడియో అందరిలో అనుమానాలు రేకెత్తించింది. ఇండస్ట్రీలో ఒకే వృత్తిలో కొనసాగుతూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏంటి? అసలు డాన్సర్ అసోసియేషన్లో జానీ మాస్టర్ వర్గం, శేఖర్ మాస్టర్ వర్గం అనే రెండు వర్గాలు ఎందుకు ఉన్నాయి ? అనే కోణంలో ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి.

నిజంగానే శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ మధ్య విభేదాల?

మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత పైన అసోసియేషన్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫెడరేషన్ అనుమతి లేకుండానే డాన్సర్స్ అసోసియేషన్లో బై ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం మీద డాన్సర్ అసోసియేషన్ లో వివాదం మొదలైందట. అదే సమయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య అభ్యంతరాలు వ్యక్తమవడంతో.. ఈ వివాదం ముదిరినట్లు వార్తలు వినిపించాయి.

Advertisement

పైగా ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన అంశాల పట్ల సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పదిమంది డాన్సర్లు అసోసియేషన్ కి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు డాన్సర్స్ అసోసియేషన్లో ఎన్నికల సభ్యత్వం అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతోనే.. సుమలత ఏకపక్షంగా వ్యవహరించారనే కారణంతో ఇలా రాజీనామాలు చేసినట్లు సమాచారం.. ఇక అదే సమయంలో జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ALSO READ:అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

సోషల్ మీడియా రూమర్స్ పై స్పందించిన జానీ మాస్టర్..

Advertisement

అలా నిన్నటి నుంచి జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్ అంటూ థంబ్ నెయిల్స్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తన భార్యతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన జానీ మాస్టర్.. శేఖర్ మాస్టర్ తో విభేదాలపై స్పందించారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ..” శేఖర్ మాస్టర్ తో విభేదాలు అంటూ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. శేఖర్ మాస్టర్ నాకు బ్రదర్ లాంటివారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. డాన్సర్స్ యూనియన్ కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇక్కడ ఎవరు ఎవరికి శత్రువులు కాదు” అంటూ స్పష్టం చేశారు. మొత్తానికైతే శేఖర్ మాస్టర్ , భాను మాస్టర్లు మంచి వ్యక్తులని వారిపై ప్రశంసలు కురిపించిన జానీ మాస్టర్.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, డాన్సర్స్ అసోసియేషన్ కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పడంతో సోషల్ మీడియా ట్రోల్స్ కి కాస్త చెక్ పడింది అనే చెప్పాలి.

Related News

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

గతాన్ని డిలీట్ చేయొచ్చు.. ప్రేమని కాదా? హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షర హాసన్ ‘సిమ్యులాక్రా’!

‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×