E-Paper
Advertisement

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?
Advertisement

Janaki Tribute: గాన కోకిల ,తనవైన పాటలతో కోట్లాది మందిని అలరించిన యస్ .జానకి రెండు రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆమెకి సమ ఉజ్జీ, తన కాలంలో దీటుగా ఎన్నో పాటలు పాడిన పి.సుశీల చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇద్దరు ఉద్దండుల మధ్య గతంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలని సుశీల ఇపుడు ప్రస్తావించడం అందరిని ఎమోషన్ కి గురిచేస్తుంది.

also read :టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?

Advertisement

అలాంటి దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా

తనకి, జానకి మధ్య ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నించారన్న చెడు నిజాన్ని బయటపెట్టింది. ఒకరిపై ఒకరికి లేనిపోని అబద్దాలు చెప్పి తమని ఏంతో మానసిక క్షోభకి గురిచేశారని,ఇపుడు అలాంటి దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఆవేదనతో ప్రశ్నించింది.ఈ కుట్రలవల్లె తాము మానసికంగా ఎంతో సంఘర్షణని అనుభవించామని .ఇపుడు ఒక సోదరి లాంటి తను ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లి పోవడం చాలా బాధగా ఉందని, నిజానికి గుండెల్లో నుంచి ఏడుపు వస్తున్నా కూడా కళ్ళలోంచి కన్నీళ్లు కూడా రావడం లేదని మనసులోని మాటని బయటపెట్టింది.

Advertisement

తానొక ఉత్సవ విగ్రహం మాత్రమే

జానకి ..మల్టీ టాలెంటెడ్ అని ,అలాంటి మనిషి మళ్ళీ పుట్టరని, ఆమె పక్కన తానొక ఉత్సవ విగ్రహం మాత్రమే అంటూ జానకి పై గల ప్రేమని, గౌరవాన్ని మాటల్లో తెలిపింది సుశీల.నిజానికి ఎస్. జానకి కేవలం ఒకే రకమైన పాటలకే పరిమితం కాలేదు. లతా మంగేష్కర్ వంటి దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా చిన్న పిల్లలలా , వృద్ధులలా తన గొంతుని మార్చి పాడటం ఒక్క ఆమెకే సొంతం.జానకి విషయానికి వస్తే 1957లో ‘ఎమ్మెల్యే’ సినిమాలోని “నీ నవ్వులే…” పాటతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా దూసుకెళ్లింది .

అలా.. నాలుగు జాతీయ అవార్డులతో పాటు దాదాపు 48 వేలకు పైగా పాటలను వివిధ భాషల్లో పాడి రికార్డు సృష్టించింది ఈ గాన కోకిల. ఇక సంగీత దర్శకుడు,మ్యాస్ట్రో ఇళయరాజాతో కలిసి ఆమె చేసిన ప్రయోగాలు నెవర్ బి ఫోర్ అని చెప్పాలి.ముఖ్యంగా ‘స్వాతిముత్యం’ సినిమాలో “చిన్నారి పొన్నారి కిట్టయ్య…” ‘సాగరసంగమం’లో “మౌనమేలనోయి…”, మరియు ‘పడమటి సంధ్యా రాగం’ వంటి పాటలు ఆమె ప్రతిభకి మచ్చు తునకలు అని చెప్పాలి.

–hP79U/

also read :విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

అలాంటి గొప్ప టాలెంట్ ఉన్న జానకిని తన వద్ద పాటలు పాడించుకోవడానికే ఆ సరస్వతీ దేవి స్వయంగా పిలుచుకుని ఉంటుందని మనసులోని మాటల్ని బయటపెట్టింది సుశీల.ఏది ఏమైనా తన గొంతుతో కోట్లాది మందిని కట్టిపడేసిన ఈ గాన కోకిల మనకి దూరమవడం నిజంగా బాధాకరం !

Related News

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

హారర్ కామెడీతో అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్!

టాలీవుడ్‌లో డ్యాన్స్ వార్: శేఖర్ మాస్టర్ vs జానీ మాస్టర్…అసలేం జరుగుతుంది?

జురాసిక్ పార్క్ నటుడు మృతి..మరణానికి కారణం?

నా కళ్ళెదుటే మా నాన్న ప్రాధేయపడ్డారు.. కంటతడి పెట్టిస్తున్న భాగ్యశ్రీ కామెంట్స్!

విజయ్ లా పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్? జూలై 18న రాబోతున్న ఆ ‘ట్విస్ట్’ ఏంటి?

Big Stories

Advertisement
×