E-Paper
Advertisement

ట్రయంఫ్ రాకెట్ 3కి స్టన్నింగ్ కలర్స్.. లుక్ చూస్తే అదిరిపోవాల్సిందే!

ట్రయంఫ్ రాకెట్ 3కి స్టన్నింగ్ కలర్స్.. లుక్ చూస్తే అదిరిపోవాల్సిందే!
Advertisement

New 2027 Triumph Rocket 3 Colours: ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన 2027 మోడల్ ఇయర్ అప్‌ డేట్‌ లో భాగంగా రాకెట్ 3 స్టార్మ్ R, రాకెట్ 3 స్టార్మ్ GT బైక్‌లకు కొత్త కలర్ ఆప్షన్లను తీసుకొచ్చింది. ఈసారి బైక్‌ ల లుక్ ను మరింత క్రేజీగా మార్చడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇంజిన్, పనితీరు, ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త రంగులతో రాకెట్ 3 ఇప్పటికే ఉన్న మస్క్యులర్ డిజైన్ మరింత స్టైలిష్‌ గా కనిపించేలా చేసింది.

రెండు కొత్త కలర్ స్కీమ్స్ లో రాకెట్ 3 స్టార్మ్ GT

రాకెట్ 3 స్టార్మ్ GT విషయానికి వస్తే..  దీనికి రెండు కొత్త కలర్ స్కీమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి ఆప్షన్ మినరల్ గ్రే – డయాబ్లో రెడ్ మిక్సింగ్. ఫ్యూయల్ ట్యాంక్‌ పై మినరల్ గ్రే రంగుతో పాటు వంపుగా ఉండే సఫైర్ బ్లాక్ స్ట్రిప్‌ పై ఎరుపు రంగులో ‘స్టార్మ్’ గ్రాఫిక్ ఉంటుంది. బైక్ మిగతా బాడీ సఫైర్ బ్లాక్‌ లో ఉండగా, రేడియేటర్ కౌల్, మడ్‌ గార్డ్ బ్రాకెట్లు మ్యాట్ ఫినిష్‌ తో మంచి అందంగా కనిపిస్తాయి. ఈ కలర్ కాంబినేషన్ GT టూరింగ్ లుక్‌ ను కొనసాగిస్తూ స్పోర్టీ టచ్‌ ను కూడా అందిస్తుంది.

Advertisement

GTకి మరో న్యూ కలర్ సఫైర్ బ్లాక్. బేస్ మెరైన్ కలయిక. బేస్ మెరైన్ రంగు ట్యాంక్‌ పై సఫైర్ బ్లాక్ స్ట్రిప్ ఉండగా, దానిపై శాండ్‌ స్టార్మ్ రంగులో ‘స్టార్మ్’ లోగో ఉంటుంది. రేడియేటర్ కౌల్‌పై కూడా అదే శాండ్‌ స్టార్మ్ షేడ్స్ ఇవ్వడం వల్ల బైక్‌ కు ప్రత్యేకమైన ప్రీమియం లుక్ వచ్చింది.

రెండు కొత్త రంగుల్లో రాకెట్ 3 స్టార్మ్ R

ఇక రాకెట్ 3 స్టార్మ్ R కూడా రెండు కొత్త రంగులను పొందింది. మొదటి కలర్ స్కీమ్‌ లో ఐరన్‌ స్టోన్, స్టార్మ్ గ్రే రంగులను స్ప్లిట్ ఫ్యూయల్ ట్యాంక్‌ పై ఉపయోగించారు. ఈ రెండు రంగుల మధ్య గ్రాఫైట్ బాణం ఆకారంలోని స్ట్రిప్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఐరన్‌ స్టోన్ పెయింట్‌ లో కనిపించే రాగి రంగు మెరుపులు బైక్‌ కు మరింత ప్రీమియం ఫినిష్‌ ను అందిస్తున్నాయి. రాకెట్ 3లో ఇప్పటికే ఉన్న మెటల్ ఎలిమెంట్స్‌ తో ఈ రంగు బాగా కలిసిపోతుందని ట్రయంఫ్ భావిస్తోంది.

Advertisement

స్టార్మ్ Rకి రెండో కొత్త ఆప్షన్‌గా సఫైర్ బ్లాక్, గ్రాఫైట్ కలర్ కాంబినేషన్‌ ను తీసుకొచ్చారు. ఈ రెండు రంగులను బాజా ఆరెంజ్ స్ట్రిప్ వేరు చేస్తుంది. మిగిలిన బాడీ మొత్తం సఫైర్ బ్లాక్‌లో ఉండగా, రేడియేటర్ కౌల్, మడ్‌గార్డ్ బ్రాకెట్లకు మ్యాట్ ఫినిష్ ఇవ్వడం ద్వారా బైక్ మరింత బోల్డ్‌గా కనిపించేలా రూపొందించారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రయంఫ్ రాకెట్ 3 స్టార్మ్ సఫైర్ బ్లాక్, కార్నివాల్ రెడ్- సఫైర్ బ్లాక్, అలాగే శాటిన్ పసిఫిక్ బ్లూ – మ్యాట్ సఫైర్ బ్లాక్ రంగుల్లో విక్రయిస్తోంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కోసం ప్రకటించిన ఈ నాలుగు కొత్త రంగులు కూడా త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also: కవాసకి బైక్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 56 వేలు తగ్గింపు!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×