Weather News: తెలంగాణలో గతం పది రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా వర్షం దంచికొడుతోంది. సాయంత్రం, రాత్రి వేళల్లో భాగ్యనగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. మొన్న ముషీరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ముగ్గురు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కొడుతోంది . మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడుతోంది.
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షం
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ALSO READ: BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ
ఆదివారం ఈ జిల్లాల్లో వాన
ఆదివారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
ALSO READ: Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
రాబోయే రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి వేళ్లలో కుండపోత వాన పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.