BigTV English

Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!

Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!

Nandamuri Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) “నందమూరి కుటుంబం” అనే ఒక మహా వృక్షాన్ని నిర్మించి, ఈ కుటుంబం ద్వారా ఎంతో మంది వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది బాలకృష్ణ (Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) మాత్రమే అనే చెప్పాలి. పైగా నాలుగు జనరేషన్ల నటులు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. వీరిద్దరి లాగా ఎవరు కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు.


నందమూరి కుటుంబంలో మళ్లీ గొడవలు..

అటు నందమూరి కుటుంబానికి, ఇటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్(Kalyan Ram) లకి మధ్య పొసగడం లేదు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బహిరంగ సభలలో ఇటు తారక్ అటు బాలకృష్ణ ఒకరికొకరు ప్రస్తావించకపోవడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో తారక్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించడంతో తారక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు బాబాయ్ బాల అంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగింది అనుకునే లోపే.. తారక్ చేసిన పోస్టు మళ్ళీ నందమూరి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయన్నడానికి సాక్ష్యంగా మారింది..


ఆశ్చర్యంగా మారిన తారక్ పోస్ట్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు దివంగత నటులు నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) 69వ జయంతి. ఈ సందర్భంగా తండ్రి జయంతిని స్మరించుకుంటూ తారక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు. “ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకొనే అశ్రుకణం మీరు” అంటూ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు అంటూ తమ అన్నదమ్ముల ఇద్దరి పేర్లను మాత్రమే ఉన్న ఒక ఫోటోని జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు.

తారక్ రివేంజ్ తీర్చుకుంటున్నారా?

ఇలా తారక్ షేర్ చేసిన ఈ ఫోటో చూస్తుంటే.. మళ్ళీ నందమూరి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి అనడానికి ఇదే సాక్ష్యం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఈవెంట్ చేసినప్పుడు నందమూరి ఫ్యామిలీలోని అందరి పేర్లు కూడా వేసుకున్నారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫోటోలు కాదు కదా కనీసం పేరు కూడా వెయ్యలేదు. ఇక ఆ కోపంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ తన తండ్రి జయంతికి తమ సోదరుల పేర్లు మాత్రమే పెట్టుకున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్పిన తారక్.. ఇప్పుడెందుకు ఇలా చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నందమూరి అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

also read:Tollywood: వెంకీ మూవీ కమెడియన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరామర్శించిన మంచు హీరో!

Related News

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

HHVM 2: వీరమల్లు పార్ట్ 2లో క్రిష్ సీన్స్… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్!

Janhvi Kapoor: కొబ్బరి చెట్టు ఎక్కిన జాన్వీ, మలయాళీల ఆగ్రహం.. ఛీ ఇంత అవమానమా!

Kishkindapuri: తూచ్ మా సినిమా వాయిదా లేదు… మిరాయ్ కు పోటీగానే

Big Stories

×