BigTV English

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Lokesh vs Jagan: మాజీ సీఎం జగన్ ఏ మాత్రం మారలేదా? అధికారంలో ఉన్నామనే ఆలోచన నుంచి బయటకు రాలేదా? జగన్‌పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వెనుక ఏం జరిగింది? పార్టీ కార్యకర్తలు కలవడానికి వీఐపీ పాసులు ఏంటి? ఇదో కొత్త పద్దతి వచ్చిందా? దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు?


వైసీపీ హయంలో జగన్ పర్యటన అంటే చాలు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు, లేకుంటే పరదాలు కనిపించేవి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ సాధారణ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. సోమవారం బెంగుళూరు నుంచి పులివెందుల వచ్చిన మాజీ సీఎం, అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కలిసేందుకు వస్తే పాసులు వైసీపీ నేతలు పెట్టడం చర్చనీయాంశమైంది. జగన్‌ను కలిసేందుకు వచ్చినవారికి ఇచ్చిన పాసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్.


జగన్ వ్యవహారశైలిపై సెటైర్లు వేశారు. ‘ఓరి నీ పాసులగోల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ALSO READ: అందరి దృష్టి ఆయన పైనే.. షర్మిళ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

వైఎస్సార్ వర్థంతి నేపథ్యంలో పులివెందులకు వచ్చారు మాజీ సీఎం జగన్. భారీ సంఖ్యలో జనం వస్తారన్న సమాచారంతో ఈ విధంగా పాసులు ఏర్పాటు చేసినట్టు వైసీపీ నేతల మాట. ఈ ప్లాన్ కాస్త బూమరాంగ్ కావడంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు.

నియోజకవర్గం ప్రజలు వచ్చి మాట్లాడేందుకు పాసుల వ్యవస్థను తీసుకురావడంతో పలువురు మంత్రులు,నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఇంకా సీఎం తరహాలో ఉన్నారని, మాజీ అన్న విషయం మరిచిపోయారని అంటున్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

 

Related News

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Jagan: ఏపీలో ఉల్లిమంటలు.. బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు-జగన్

Pulevendula: అందరి దృష్టి ఆయన పైనే.. షర్మిళ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Amaravati News: పైసా మే ప్రమోషన్‌ చిచ్చు.. సాక్షి పత్రికపై కేసు నమోదు

Big Stories

×