Kireeti Reddy Car Stunt Making Video: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా నటించిన చిత్రం జూనియర్. ఈ సినిమాతో అతడు సినీరంగ ప్రవేశం చేశాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించి ఈ సినిమాలో జెనిలియా ముఖ్యపాత్ర పోషించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇదే కావడం విశేషం. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చిత్రం సంస్థపై రజని కొర్రపాటి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా స్లో గా షూటింగ్ పూర్తి చేసుకుంది. నాలుగు ఏళ్ల తర్వాత ఈ చిత్రం విడుదలైంది.
డ్యాన్స్ తో సర్ప్రైజ్
ఇది కిరీటికి డెబ్యూ చిత్రమే అయినా అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. ఇక డ్యాన్స్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. శ్రీలీలనే డామినేట్ చేశాడు. వైరల్ వయ్యారి పాటలో కిరీటీ తన డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఎక్కడైన డ్యాన్స్ హీరోలను డ్యామినేట్ శ్రీలీలనే ఈ జూనియర్ డామినేట్ చేశాడు. ఎంతో క్లిష్టమైన స్టెప్పులను సైతం అలోవోక వేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. దీంతో కిరీటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కిరీటీ నటన, డ్యాన్స్ కి మాత్రం ఆడియన్స్ నుంచి ప్రశంసల వస్తున్నాయి. విమర్శకుల సైతం కిరీటీ టాలెంట్ ని కొనియాడుతున్నారు.
Behind the making of my stunt in #Junior
Thanks to Peter Hein Master and all the stunt crew for ensuring my safety. pic.twitter.com/ua7eDQ08Eh
— Kireeti (@KireetiOfficial) July 22, 2025
జూనియర్ మేకింగ్ ఆఫ్ స్టంట్ వీడియో
ఇదిలా ఉంటే తాజాగా కిరీటీ జూనియర్ మూవీ మేకింగ్ వీడియో ని షేర్ చేశాడు. బిహైండ్ ది మేకింగ్ ఆఫ్ మై స్టంట్స్ అంటూ కారుపై నుంచి దూకి సీన్ ని షేర్ చేశాడు. ఈ సీన్ కోసం అతడు చాలా టేక్స్ తీసుకున్నట్టు అనిపిస్తోంది. ఈ మేకింగ్ వీడియోని షేర్ చేస్తూ కిరీటీ.. స్టంట్స్ మాసర్ట్స్ పీటర్ హేన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే మూవీ టీంకి ధన్యవాదాలు తెలిపాడు. ఇందులో లాంటి డూప్ లేకుండ ప్రమాదకరమైన ఈ స్టంట్ సీన్ లో కిరిటీ స్వయంగా నటించాడు. ఈ వీడియోతో అతడి డెడికేషన్, సినిమా పట్ల అతడికి ఉన్న ప్యాషన్ అర్థమైపోతుంది.. ఇండస్ట్రీలో ఓ టాలంటెడ్ హీరో దొరికేసాడంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
Also Read: Hari Hari Hara Veeramallu: మూవీపై ఫుల్ బజ్.. ఇంకా ఒపెన్ కానీ బుకింగ్స్.. నైజాంలో ఏం జరుగుతోంది..
కథేంటంటే..
విజయనగరానికి చెందిన కోదండపాణి (రవి చంద్రన్), శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(గాలి కిరీటి రెడ్డి). బిడ్డ పట్టగానే శ్యామల చనిపోతుంది. దీంతో కోదండ పాణి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. లేక లేక పుట్టిన బిడ్డ కావడం, తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటంతో కోదండ పాణి అభిపై అతి ప్రేమ పెంచుకుంటాడు. ఇక తండ్రి చూపించే ప్రేమ అతడికి చిరాకు తెప్పిస్తుంది. దీంతో పై చదువుల వంకతో తండ్రికి దూరంగా వెళ్లిపోతాడు. ఆ సమయంలో హీరోయిన్ స్ఫూర్తి (శ్రీలీల) తో ప్రేమలో పడతాడు. ఆమె చేసే కంపెనీలో ఉద్యోగంలో సంపాదిస్తాడు. ఆ కంపెనీ లో విజయ సౌజన్య (జెనిలియా) బాస్. తన ప్రవర్తనతో ఆమెకు చిరాకు తెప్పిస్తుంటాడు విజయ్. అయితే అభి బ్యాగ్రౌండ్ తెలిసి ఆమె షాక్ అవుతుంది. ఇంతకి అభికి, విజయ సౌజన్యకు మధ్య సంబంధమేంటి? విజయనగరంతో ఆమెకు ఉన్న అనుభం ఏంటి? అభి తండ్రి సిటీకి రావడానికి కారణమేంటి? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.