BigTV English

Rana Daggubati: బెట్టింగ్ యాప్స్ విచారణకు హీరో రానా డుమ్మా? సారీ అంటూ

Rana Daggubati: బెట్టింగ్ యాప్స్ విచారణకు హీరో రానా డుమ్మా? సారీ అంటూ

Rana Daggubati: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల బెట్టింగ్ యాప్స్(Betting App) ప్రమోషన్ల పై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి తదితరులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా కేసు నమోదు కావడంతో ఈడీ అధికారులు సదరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ క్రమంలోనే హీరో రానా(Rana) సైతం విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈయన మాత్రం విచారణకు హాజరు కాలేనని అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.


అందుబాటులో లేని రానా..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగంగా విచారణకు ఈడీ షెడ్యూల్ ఖరారు చేశారు. 21వ తేదీ రానా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ,మంచు లక్ష్మీ వంటి సెలబ్రిటీలకు సమన్లు జారీ చేశారు. అయితే ఈనెల 23వ తేదీ రానా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం అందుబాటులో లేని సమక్షంలో 23వ తేదీ జరగాల్సిన విచారణకు తాను హాజరు కాలేనని, తనకు మరో రోజు సమయం కావాలి అంటూ ఈయన ఈడీ అధికారులకు  తెలియజేశారు. ఇక ప్రకాష్ రాజ్(Prakash Raj) ఈనెల 30వ తేదీ, మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఆగస్టు13 వ తేదీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఆగస్ట్ 6వ తేదీ విచారణకు హాజరుకావాలని సూచించారు.


విచారణకు హాజరు కావాల్సిందే..

ఈ విధంగా విచారణకు హాజరు కావలసిన సెలబ్రిటీలు విచారణకు వెళ్లే సమయంలో పాన్ కార్డుతో పాటు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను  అలాగే లోన్ ఆప్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని ఉదయం 11 బషీర్ బాగ్ లోని ఈడి జోనల్ ఆఫీస్ లో హాజరుకావాలని సూచించారు. అయితే రానాకు రేపు విచారణ ఉండగా ఈయన మాత్రం అందుబాటులో లేను అంటూ అధికారులకు సమాచారం అందజేస్తూ ఈ విచారణకు డుమ్మా కొట్టారని తెలుస్తుంది. ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డబ్బు పోగు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్…

ఇలా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు అంటూ గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ యూట్యూబ్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరి బాగోతం మొత్తం బయటపెట్టారు. ఇలా అన్వేష్ వీడియోల ద్వారా అధికారులు కూడా యూట్యూబర్స్ నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు పాల్పడినట్లు తేలడంతో వారిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇక రానా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన షూటింగ్ పనుల నిమిత్తం అందుబాటులో లేని సమక్షంలో విచారణకు హాజరు కాలేకపోతున్నారని తెలుస్తుంది.

Also Read: Anchor Suma: హీరోయిన్ గా సుమ.. దాసరి గారికి అన్ని కండిషన్లు పెట్టిందా?

Related News

Meenakshi Chaudhary: హైదరాబాదులో సందడి చేసిన మీనాక్షి.. గ్లామర్ తో ఆకట్టుకుంటూ!

Film industry: అధికార దుర్వినియోగం అంటూ పవన్ పై కేస్.. హైకోర్టు అదిరిపోయే రియాక్షన్!

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కు ఘోర ప్రమాదం, అసలు విషయం చెప్పిన చందమామ!

Kishkindhapuri Vs Mirai : సెప్టెంబర్ 12న రాబోయే రెండు సినిమాల డ్యూరేషన్ లు ఇవే

Ilayaraja: ఇళయరాజాకు మద్దతుగా మద్రాస్ హైకోర్టు, అయినా ఈ ఏజ్ లో చాదస్తం ఏంటండీ

Little Hearts: యుఎస్ లో తెలుగోళ్ళు మాస్, ఏకంగా ట్రంప్ తో మీటింగ్ కి సిద్ధమవుతున్న యంగ్ హీరో

Big Stories

×