Gabbar Singh..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా.. హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో బండ్ల గణేష్ (Bandla Ganesh) నిర్మాతగా వచ్చిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాతో అందరి అదృష్టాలు మారిపోయాయని చెప్పుకోవచ్చు.ఎందుకంటే చాలా సినిమాలు చేస్తూ ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి అలాగే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న శృతిహాసన్(Shruti Haasan) కి, డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)కి అలాగే నిర్మాతకి కూడా ఈ సినిమా మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
గబ్బర్ సింగ్ సినిమాలో ఆ ఒక్క సీన్ తో భారీ పాపులారిటీ..
అయితే అలాంటి ఈ సినిమాలో అంత్యాక్షరి సీన్ ద్వారా అంత్యాక్షరి టీం ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాలోని అంత్యాక్షరి సీన్.. సినిమాకే పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలా ఈ అంత్యాక్షరి సీన్ లో పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు వేసుకొని రౌడీలుగా ఉన్న వాళ్ళందరూ పాటలు పాడుతూ కామెడీని తెప్పించే ఈ సీన్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. అలా గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమాలో అంత్యాక్షరి సీన్ లో వీళ్ళు చేశాక వీరికి అంత్యాక్షరి టీమ్ అనే పేరు కూడా వచ్చింది. అయితే అలాంటి గబ్బర్ సింగ్ సినిమాలోని అంత్యాక్షరి టీం ద్వారా ఫేమస్ అయిన వారిలో నటుడు సాయి కూడా ఒకరు..
గబ్బర్ సింగ్ నటుడికి హత్యా బెదిరింపులు..
అయితే తాజాగా సాయి (Sai) కి వైసీపీ కార్యకర్తల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అది కూడా చంపేస్తామని. మరి ఇంతకీ వైఎస్ఆర్సిపి పార్టీతో నటుడు సాయికి ఉన్న గొడవ ఏంటి.. ? ఎందుకు సాయిని చంపేస్తామని వార్నింగ్ లు ఇస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu)సినిమా విడుదలై అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన ఎంతోమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని మరీ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అయితే ఈ సినిమాని థియేటర్లో చూసిన గబ్బర్ సింగ్ నటుడు సాయి సినిమా ఎలా ఉందని కొంతమంది రివ్యూ అడగగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
వైసీపీ నాయకులపై సాయి అనుచిత వ్యాఖ్యలు..
ఆయన మీడియా వాళ్లతో వైఎస్ఆర్సిపి వాళ్ల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. మా పవన్ కళ్యాణ్ అన్న సినిమాని అడ్డుకోవాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈరోజు విడుదలై హిట్ అయినందుకు మా పవన్ అన్న సీఎం అయినంత ఆనందంగా ఉంది. వైసీపీ కొడుకులు, ఒక శ్యామల (Shyamala)పంది పిల్ల, ఒక రోజా(Roja) బర్రె వీళ్లంతా కలిసి పవన్ కళ్యాణ్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. పవన్ అన్న సినిమా హిట్ తో వీళ్ళందరికీ చెంప దెబ్బ, చెప్పు దెబ్బ.. నేను ఈ మాటలు మాట్లాడడానికి కారణం చాలా రోజుల నుండి పవన్ అన్నని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ సినిమా హిట్ తో ఆయన రేంజ్ పెరిగిపోయింది. మీలాగా ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. రోజా తిరుపతిలో టికెట్లు అమ్ముకున్నట్టు ఆయన చేయలేదు. ఆయన సినిమాలనే నమ్ముకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయిన వైసీపీ కార్యకర్తలు గబ్బర్ సింగ్ నటుడు సాయికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు సమాచారం. మరి సాయికి జనసేన నుండి మద్దతు లభిస్తుందేమో చూడాలి.
వైసీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పిన సాయి..
ఈ విషయం గురించి తాజాగా సాయి స్పందిస్తూ.. “నేను ఆవేశంలో వైసిపి(Ycp) కార్యకర్తల గురించి తప్పుడు మాటలు మాట్లాడాను. అలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నాను.గత రెండు రోజుల నుండి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అలాగే తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.