BigTV English

Gift Items: పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవ్వరికీ.. బహుమతిగా ఇవ్వొద్దు !

Gift Items: పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవ్వరికీ.. బహుమతిగా ఇవ్వొద్దు !

Gift Items: బహుమతి ఇవ్వడం, తీసుకోవడం అనేది మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి బహుమతులు ఒక గొప్ప మార్గం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. బహుమతిగా ఇచ్చే వస్తువులు మన జీవితాలపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం అశుభమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటో.. వాటిని ఎందుకు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


1. కత్తి, కత్తెర లేదా పదునైన వస్తువులు:
పదునైన వస్తువులైన కత్తి, కత్తెర, లేదా కత్తిపీట వంటివి బహుమతిగా ఇవ్వడం వాస్తు ప్రకారం చాలా అశుభం. ఇలాంటి వస్తువులు ఇద్దరి మధ్య సంబంధాలను తెంచేస్తాయని.. విభేదాలు సృష్టిస్తాయని నమ్ముతారు. ఇవి కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య దూరాన్ని పెంచుతాయి. వీటికి బదులుగా.. మీరు ప్రశాంతతను, ఆనందాన్ని సూచించే వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది.

2. నలుపు రంగు బట్టలు:
నలుపు రంగు దుస్తులు లేదా ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం వాస్తులో శుభప్రదం కాదు. నలుపు రంగు దుఃఖాన్ని, ప్రతికూల శక్తిని సూచిస్తుంది. అయితే.. అన్ని సందర్భాల్లోనూ ఇది వర్తించకపోవచ్చు. ఒకవేళ స్నేహితుడికి నలుపు రంగు ఇష్టమైతే.. ఇవ్వవచ్చు. కానీ ప్రత్యేకమైన శుభ సందర్భాలలో నలుపు రంగు దుస్తులను ఇవ్వడం మానుకోవడం మంచిది.


3. ఆగిపోయిన గడియారం:
ఆగిపోయిన లేదా పగిలిన గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం అశుభం. గడియారం పురోగతికి.. సమయానికి చిహ్నం. ఆగిపోయిన గడియారం జీవితంలో ఎదుగుదల లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇలాంటి బహుమతిని ఇస్తే.. మీ ప్రియమైనవారి జీవితంలో పురోగతి ఆగిపోతుందని భావిస్తారు. అలాగే.. మీరు పగిలిన లేదా ఆగిపోయిన వస్తువులను ఎప్పుడూ ఇంటిలో ఉంచుకోకూడదు.

4. శంఖం లేదా శంఖం బొమ్మలు:
శంఖం చాలా పవిత్రమైనది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువు. అయితే.. శంఖాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే.. శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. ఒకవేళ మీరు దాన్ని బహుమతిగా ఇస్తే.. మీ ఇంటిలోని లక్ష్మీ దేవి ఆశీస్సులు ఆ వ్యక్తికి వెళ్ళిపోతాయని నమ్ముతారు.

5. కర్చిప్ (చేతి రుమాలు):
చేతి రుమాలును బహుమతిగా ఇవ్వడం దురదృష్టకరం అని వాస్తు నిపుణులు చెబుతారు. ఇది సంబంధాలలో విభేదాలు, భావోద్వేగ సమస్యలు, వివాదాలను తీసుకొస్తుందని నమ్ముతారు. ఇటువంటి బహుమతిని ఇచ్చిపుచ్చుకోవడం వల్ల దుఃఖం పెరుగుతుందని నమ్మకం.

Also Read: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

6. దేవుడి విగ్రహాలు లేదా ఫొటోలు:
కొన్నిసార్లు మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పవిత్రమైన స్థలాన్ని సందర్శించినప్పుడు, దేవుడి విగ్రహాలను లేదా చిత్రాలను బహుమతిగా ఇస్తుంటాము. కానీ.. ఇలాంటి వస్తువులను ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి శుభప్రదమైనవి అయినప్పటికీ.. వాటిని ఇంట్లో ఉంచుకునే వారికి వాస్తు ప్రకారం కొన్ని నియమాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఇచ్చే వారికి ఈ నియమాలు పాటించడం తెలియకపోతే.. ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే.. దేవుడి విగ్రహాలను బహుమతి గా ఇవ్వడం మానుకోవడం మంచిది.

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Big Stories

×