E-Paper
Advertisement

ఎంత కొట్టినా చావ‌ని పామురా వాడు! రావ‌ణ్‌ను ఎంత బ్లేమ్ చేద్దామ‌నుకున్నా.. మైలేజే వ‌స్తుంది..?

ఎంత కొట్టినా చావ‌ని పామురా వాడు! రావ‌ణ్‌ను ఎంత బ్లేమ్ చేద్దామ‌నుకున్నా.. మైలేజే వ‌స్తుంది..?
Advertisement

గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు. అయినా వ‌ద‌ల‌డం లేదు వాడిని. అదే రావ‌నుడిని. అదే.. యూట్యూబ‌ర్ బ‌చ్చ‌ల‌కూరి జోసెఫ్‌ని. కేసు పెట్టారు వ‌దిలేయొచ్చుగా. బెయిల్ రావ‌డం.. మ‌రో కేసులో ఇరికించ‌డం, మ‌ళ్లీ బెయిల్ రావ‌డం.. ఇంకో కొత్త కేసు వెతికిప‌ట్టి.. దొర‌క‌బ‌ట్టి లోప‌లేసి.. ! చూసే వారికే అనిపించింది. ఆ ప‌వ‌న్‌, ఆ చంద్ర‌బాబు ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా బాబు ! అని.

అవును మ‌రి. వాడేదో అన్నాడు. అట్లాంటి వాళ్లు మంచిగా వెతికితే వంద‌ల‌ సంఖ్య‌లో దొరుకుతారు ప‌వ‌న్‌కు. కానీ వీడినే ప‌ట్టుకున్నాడు ప‌వ‌న్‌. స‌రే, పోలీసుల‌కు ప‌ని అప్ప‌గించాడు. వాళ్ల ప‌నేదో చేసుకుంటారు. వ‌దిలేయొచ్చుగా. వెంట‌ప‌డి, వేటాడి.. కెమెరామెన్ గంగ‌తో రాంబాబులో మీడియా మీద లెక్చ‌ర్లు ఇచ్చిన‌ట్టు.. మీడియా అంటే ఇట్ల‌నే ఉండాలి. ప్ర‌శ్న‌లిలా అడ‌గాలి.. హ‌ద్దులివీ..! అంటూ గిరిగీసుకుని, వేషం వేసుకుని.. అబ్బా చూడ‌బుద్ది కాలేద‌నుకో!

Advertisement

మొన్న‌టి మొన్న ఆ నాగేశ్వ‌ర్ విష‌యంలో కూడా ఇలా అతి చేసి, మూర్ఖంగా పోయి.. తిట్ల దండ‌కం విన్న త‌రువాత‌, తెలంగాణ వాదాన్ని రెచ్చ‌గొట్టే దాకా పోయి.. వెన‌క్కి త‌గ్గాడు. ఇప్పుడు ఈ రావణ్ విష‌యంలో కూడా. దేశ ద్రోహం కేసు పెట్టించ‌డంతో అంతా తిట్టుకున్నారు. ఓర్నీ మ‌రీ ఇంత‌లా వెంటాడాలా? అని.

ఇక ఇప్పుడు అత‌డి ఫోన్లో అమ్మాయిల అశ్లీల వీడియోలున్నాయ‌ని గుర్తించార‌ట పోలీసులు. ఓ ప‌ది మంది వ‌ర‌కు ఉండొచ్చ‌ట‌. లీకులు క‌రెక్టో కాదో తెలియ‌దు. నిజంగా ఉన్నాయో కూడా అనుమాన‌మే. ఎందుకంటే పోలీసుల ఓవ‌రాక్ష‌న్ అలా ఉంది మ‌రి. దీనికి నేత‌ల స‌పోర్టు కూడా అంతే ఉంది. ఈ ఎపిసోడ్ కాస్తా కూట‌మి ప్ర‌భుత్వానికి ఓ మ‌చ్చ‌లాగే ఉంది త‌ప్ప‌.. మైలేజీ రావ‌డం లేదు.

Advertisement

పైగా ఆ రావ‌ణుడికే మైలేజీ వ‌స్తోంది ఏమిటో గానీ! వాడు కూడా పిడికిలెత్తి మ‌రీ ఓ చిరున‌వ్వు విస‌ర‌డం…. ఇంకా చిరాకు తెప్పిస్తోంది ప‌వ‌న్‌కు. వీడ్ని ఇంకా ఇంకా లోప‌లేసి కుమ్మండిరా..!అని ఆదేశిచ్చి ఉంటాడు. బాబు కూడా ఏం చేస్తాడు? వంత పాడ‌టం త‌ప్ప‌. మొన్న అధికారం రాగానే లోకేశ్ బాబు.. రెడ్ డైరీ అంటూ వార్నింగులు ఇచ్చుకుంటూ తిరిగినా.. త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. ఇక దానిపై ఊసులేదు. చేయాల్సింది చాలా ఉంది. అది చేసుకుంటూ పోవాలె త‌ప్ప‌.. ఇలా డైరీలు రాసుకుంటూ పోతే..పేజీలు స‌రిపోవ‌ని తెలుసుకుని ఉంటాడు లోకేశు.

కానీ ప‌వ‌న్‌కే ఇంకా త‌త్వం బోధ‌ప‌డ‌లేదు. ఇంకా సోష‌ల్ మీడియాను వెంటాడే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. నాతో పెట్టుకుంటే ఒక్కొక్క‌డి తాటా తీస్తా అని సినిమాలో డైలాగులు కొట్టుకుంటూ.. త‌నను తిట్టే వారిని వెతికి వెతికి ప‌ట్టే ప‌నిలో ఉన్నాడు. గొంగ‌ట్లో తింటూ వెంట్రుక‌లు ఏరిన‌ట్టుగా.. స‌మ‌యం అంతా దీనికే కేటాయిస్తున్నాడు కాబోలు.

మ‌రి తెలంగాణ‌లో కాలుమోపి, రాజ‌కీయాలు చేసేందుకు స‌మ‌యం దొర‌కుతుందో లేదో, ఇక్క‌డా సోష‌ల్ మీడియా ప‌ని ప‌ట్టే ప‌నిలో ఉంటాడేమో! ఎలాగూ తెలంగాణ పోలీసులు కూడా ప‌వ‌న్‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్టున్నారు. మొన్న‌టి కేవీఆర్ అరెస్టు చూసిన త‌రువాత చాలా మందికి ఇదే అర్థ‌మైంది. నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి లేక్కే లేదు… అన్న‌ట్టుగా గుడ్డిగా వెళ్లిపోతున్నాడు.. యూట్యూబ‌ర్ల‌ను వేటాడేందుకు.

Related News

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

Big Stories

Advertisement
×