Srividya Biography: సిల్వర్ స్క్రీన్ పై వెలిగిన ఎందరో తారల జీవితాలు పైకి కనిపించే రంగుల ప్రపంచమంతా అందంగా ఉండవన్న సంగతి తెలిసిందే.ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఎంటర్టైన్ చేసే వీరి వెనకాల కనిపించని గాయాలు ఎన్నో.అలాంటి ఒక గాయమే శ్రీవిద్య.నటన, అందం అద్భుతమైన గాత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన శ్రీవిద్య కూడా ఇలానే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
శ్రీవిద్య విషయానికి వస్తే 1953 జులై 24న మద్రాసులో ఒక కళాకారుల కుటుంబంలో జన్మించింది.ఆమె తండ్రి వికటన్ ఆర్. కృష్ణమూర్తి.ఆయన తమిళ సినిమాల్లో కమెడియన్ కాగా తల్లి ఎంఎల్ వసతకుమారి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు .శ్రీవిద్య పుట్టిన కొద్ది కాలానికి తండ్రి పక్షవాతం బారిన పడటంతో పూర్తిగా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది ఈ కుటుంబం.ఇక కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ఆమె తన చదువుని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది.
‘తిరువరుట్చెల్వర్’ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా
కేవలం 14 ఏళ్ల వయసులోనే అంటే 1967లో శివాజీ గణేషన్ నటించిన పౌరాణిక సినిమా ‘తిరువరుట్చెల్వర్’ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇందులో సావిత్రి, జెమినీ గణేషన్ వంటి గొప్ప వాళ్ళ సరసన శివశక్తి నందనంగా మెప్పించింది కూడా .ఆ తర్వాత 1969లో ‘కుమార సంభవం’తో మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీవిద్య .అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం శ్రీవిద్య ప్రయాణం 1969 లో వచ్చిన పేదరాశి పెద్దమ్మ కథతో మొదలైంది.
కాంతారావుకి జోడిగా రాజకుమారిగా అలరించిన శ్రీవిద్య ఆ తర్వాత దాసరి నారాయణరావు తొలి సినిమా తాత మనవడులో ‘రాయంటి నా మొగుడు రంగా’ అనే ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసి అందరిని ఆకర్షించింది.ఇక కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ కి జోడిగా రాముని మించిన రాముడు లో హీరోయిన్ గా,కథానాయకుని కథలో ఆయన చెల్లెలిగా, కృష్ణ నటించిన ‘గాలిపటాలు’ కీలకపాత్రలో కనిపించి మల్టీ టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంది శ్రీవిద్య .అయితే 1975లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ తెలుగు రీమేక్ ‘తూర్పు పడమర’ సినిమా శ్రీవిద్య సినిమాని మలుపు తెప్పిందని చెప్పాలి.ఆ సినిమాలో ‘శివరంజని, నవరాగిణి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది .
ఒకే హీరోకి జోడిగా 4 విభిన్నమైన కీలకపాత్రలను
ఇక శ్రీవిద్య సినిమా కెరియర్ లో సూపర్ స్టార్ రజినీతో ఉన్న అనుబంధం చాలా స్పెషల్.ఒకే హీరోకి జోడిగా 4 విభిన్నమైన కీలకపాత్రలను పోషించిన నటి బహుశా శ్రీవిద్య కావచ్చు .అపూర్వ రాగంగళ్ సినిమాలో రజనీకాంత్ కు ప్రేయసిగా నటించి రజనీ ఫస్ట్ హీరోయిన్ అన్న ట్యాగ్ పొందిన శ్రీవిద్య, ఆ తర్వాత 1989లో ‘మాపిళ్లై’ చిత్రంలో అత్తగా, 1991లో మణిరత్నం క్లాసిక్ ‘దళపతి’లో తల్లిగా, 1993లో ‘అత్తురువాలి’ చిత్రంలో నటించి మెప్పించింది శ్రీవిద్య . ఇక దాసరి నారాయణరావు, కే. బాలచందర్ వంటి గొప్ప గొప్ప దర్శకులు ఆమెలోని నటనను గుర్తించినూట్రిక్కు నూరు’, ‘బంట్రోతు భార్య’, ‘కన్యా-కుమారి’ వంటి సినిమాల్లో మంచి మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు.
ఆ తర్వాత కాలంలో చిరంజీవి (కొండవీటి దొంగ, ముగ్గురు మొనగాళ్లు), (బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ,బంగారు బుల్లోడు), నాగార్జున (విక్కీ దాదా, వెంకటేష్ ధర్మచక్రం బ్రహ్మపుత్రుడు).. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది .ఇక శ్రీవిద్య కేవలం నటి మాత్రమే కాదు మంచి ప్లేబ్యాక్ సింగర్ కూడా.అయితే సినిమా లైఫ్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి.కమలహాసన్ తో ఏర్పడిన పరిచయం గాఢమైన ప్రేమగా మారింది .ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించి కమల్ స్వయంగా శ్రీవిద్య సోదరుడు శంకర్ తో మాట్లాడాడు .కానీ శ్రీవిద్య తల్లి వసంతకుమారి మాత్రం వీరి ప్రేమను ఒప్పుకోలేదు.కమల్ వయసులో శ్రీవిద్య కంటే ఏడాది చిన్నవాడు కావడం, ఇద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉండటం, అప్పుడప్పుడే శ్రీవిద్య కెరియర్ పిక్స్ కి వెళ్తుండటంతో ఆమె ఈ పెళ్లిని అంగీకరించలేదు.
మరో మలుపు తిప్పిన జార్జ్ థామస్ పరిచయం
కమల్ కి దూరమై ఎంతో వేదనను అనుభవించింది.ఆ తర్వాత కమలహాసన్ గణపతి వాణి గణపతి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రేమ లవ్ బ్రేకప్ తర్వాత 1976 లో ‘శ్రీ కన్నల్’అనే మలయాళ సినిమా నిర్మాత అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్ ఆమెకు ఏర్పడ్డ పరిచయం జీవితాన్ని మరో మలుపు తిప్పింది .మానసికంగా ఒంటరిన శ్రీవిద్యను జార్జ్ తన మాటలతో ఆకట్టుకొని ఆకట్టుకున్నాడు .అయితే బ్రాహ్మణ అమ్మాయి అయిన శ్రీవిద్య క్రైస్తవ మతస్తుడైన జార్జ్ ని పెళ్లాడటానికి తల్లి మళ్ళీ వద్దని వారించినా ఆమె వినలేదు.ముంబై వెళ్లి క్రైస్తవ మతం స్వీకరించి మరీ జార్జ్‌ను పెళ్లి చేసుకుంది శ్రీవిద్య .అయితే జార్జ్ తీసిన సినిమా ప్లాప్ అవడంతో ఫైనాన్షియల్ ఇబ్బందులు మొదలయ్యాయి.దాంతో శ్రీవిద్యను మళ్ళీ నటించాలని జార్జ్ ఒత్తిడి చేయడం మొదలెట్టాడు.
అయితే ఆమె తిరిగి మేకప్ వేసుకొని సంపాదిస్తుంటే ఆ డబ్బులు లాక్కోడమే కాకుండా, ఆమెపై అనుమానంతో తీవ్రంగా వేధించడంతో భరించలేక ఇల్లు వదిలి వచ్చిన బయటికి వచ్చింది.అలా సుదీర్ఘ న్యాయపోరాటం చేసి ఎట్టకేలకి 1988లో విడాకులు తీసుకుంది.ఇక ఆ తర్వాత మలయాళ దర్శకుడు భరత్‌తో ప్రేమాయణం సాగించినా అదీ సఫలం కాలేదు.
దాదాపు 800 పైగా సినిమాలు నటించిన మహానటి
ఆర్థికంగా, మానసికంగా చితికపోయినా శ్రీవిద్యకి సత్య సాయిబాబా అంటే అమితమైన భక్తి .అలా తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో దాదాపు 800 పైగా సినిమాలు నటించిన ఈ మహానటి ని విధి మరోసారి వచించింది.2003లో ఆమెకు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది.అయితే ఆ క్యాన్సర్ తో కూడా ఆమె మూడేళ్ల పాటు పోరాడటంగమనార్హం .ఇక ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమె ఎవరిని కలవడానికి ఇష్టపడకపోయినా ఆమె తొలి ప్రేమ కమలహాసన్ మాత్రం వచ్చి పరామర్శించేవాడట .జీవితంలో పోరాడి అలసిపోయాను భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అని కమల్ తో చివరి రోజుల్లో అన్న మాటలు కన్నీరు తెప్పిస్తాయి.
అనాథలా చనిపోవడం బాధాకారం
ఇక చివరి రోజుల్లో చెన్నై వదిలి తిరువనంతపురంలో స్థిరపడ్డ శ్రీవిద్య చనిపోవడానికి రెండేళ్ల ముందు ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ సహాయంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది .తన కోట్ల విలువైన ఆస్తిని పేద విద్యార్థుల చదువు కోసం సంగీతం,నాట్యం ,కళల అభివృద్ధి కోసం రాసి ఇచ్చేసింది శ్రీవిద్య.తన అన్నయ్య పిల్లలకు చెరో ఐదు లక్షలు, ఇంట్లో పని చేసే వారికి తలా లక్ష రూపాయలు ఇచ్చి 2006 అక్టోబర్ 19న తన 53వ వయసులో లోకాన్ని విడిచి వెళ్ళింది శ్రీవిద్య .ఏది ఏమైనా వెండితెరని ఏలి చివరికి ఇలా అనాథలా చనిపోవడం బాధాకారం.