Nag Ashwin :కల్కి 2 (Kalki 2) నుంచి దీపికా పదుకొనే (Deepika Padukone)ను తప్పిస్తున్నట్లు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ఎప్పుడైతే ప్రకటించిందో.. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీపిక పదుకొనేను ఉద్దేశించి పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ను కూడా ఈ విషయంలోకి లాగుతూ మరింత వైరల్ చేస్తున్నారు.. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దీపికపై వ్యతిరేకత భారీగా పెరిగిపోయిందని సందేహం లేదు.
ఇలాంటి సమయంలో తాజాగా కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్న ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీపికాపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. కల్కి 2898 ఏడి చిత్రంలోని కృష్ణుడి ఎంట్రీ సీన్ ను నాగ్ అశ్విన్ షేర్ చేస్తూ..” కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే” అని అశ్వద్ధామతో కృష్ణుడు చెప్పే డైలాగుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఒక ఆసక్తికర క్యాప్షన్ కూడా పంచుకున్నారు నాగ్ అశ్విన్. ఇందులో..” జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు.. కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు” అంటూ తెలిపారు. దీంతో ఈ టాలెంటెడ్ దర్శకుడు దీపికను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు.
ప్రభాస్ అభిమానులు ఫైర్..
ఇకపోతే దీపికాపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ కూడా అనుమానాలకు దారితీస్తోంది . ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులో ఈమె భాగం కాకపోవడం పై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పారితోషకం ఎక్కువగా డిమాండ్ చేసిందని.. దీనికి తోడు పని దినాలు ఏడు గంటలు మాత్రమే అడిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న యుద్ధమే జరుగుతుంది. దీపికా కు అండగా ఆమె అభిమానులు వరుసగా పోస్ట్లు పెడుతుంటే.. ప్రభాస్ (Prabhas ) అభిమానులు మాత్రం విమర్శిస్తూ రిప్లై ఇస్తున్నారు.
ALSO READ:Maruti Suzuki: జీఎస్టీ తగ్గుదల వేళ.. న్యూ మారుతీ సుజుకి విక్టోరియస్ ఆవిష్కరణ.. అతిథిగా మంత్రి!
దీపికా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
ఇంకొంతమంది దీపికా రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే కల్కి 2 నుంచి ఇప్పుడు దీపికను తొలగించారు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే కల్కి సినిమాలో సుమతి పాత్రలో నటించి దీపిక తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. నెక్స్ట్ సీక్వెల్లో ఈమె పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. దీపిక పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ (Atlee), అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది . ఇక్కడ ఈమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.