BigTV English

Maruti Suzuki: జీఎస్టీ తగ్గుదల వేళ.. న్యూ మారుతీ సుజుకి విక్టోరియస్ ఆవిష్కరణ.. అతిథిగా మంత్రి!

Maruti Suzuki: జీఎస్టీ తగ్గుదల వేళ.. న్యూ మారుతీ సుజుకి విక్టోరియస్ ఆవిష్కరణ.. అతిథిగా మంత్రి!

Maruti Suzuki:కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తగ్గిన ఈ జీఎస్టీ ధరలు సెప్టెంబర్ 22 నుండి అందుబాటులోకి రాబోతున్నాయి అటు నిత్యవసరాల సరుకులతో పాటు ఫోర్ వీలర్, టూ వీలర్ వెహికల్స్ పై కూడా ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా పలు దిగ్గజ కార్ బ్రాండ్లు కూడా సుమారుగా లక్షన్నర వరకు ధరలు తగ్గిస్తూ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి జీఎస్టీ ధరలు తగ్గిన వేళ మరో కొత్త మోడల్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. అయితే ఈ కొత్త మోడల్ ను తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.


అసలు విషయంలోకి వెళ్తే.. మారుతి సుజుకి తన కొత్త విక్టోరియాస్ కారును హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పవన్ మోటార్స్ షోరూమ్ లో ఆవిష్కరించింది. హైబ్రిడ్ మోడల్ 28.65 కిలోమీటర్ పి ఎల్ మైలేజీ, ఆధునిక భద్రత ఫీచర్లు అలాగే ఫైవ్ స్టార్ భారత్ NCAP రేటింగ్ ను అందిస్తోంది. పవన్ మోటార్స్ షోరూమ్ లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, CBH సౌత్ ఈస్ట్ జోన్ R. సురేష్ బాబు, RM ప్రతిబన్ తో పాటూ పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..


“మారుతి కారు అంటే ఒక ట్రెండ్.. ఇండియాలోనే చాలా మంది ఎక్కువగా వాడే కార్ మారుతి. ఇపుడు పవన్ మోటార్స్ కొత్త మారుతి విక్టోరియస్ కారును తీసుకువచ్చారు. ఈ కార్ చాలా లగ్జరీ గా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి కారును..అన్ని సదుపాయాలతో మారుతి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మారుతి వాళ్ళు ఈ కార్ ను తీసుకువచ్చింనదుకు వాళ్ళని అభినందింస్తున్నాను” అంటూ తెలిపారు.

కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ.. “మా పవన్ మోటార్స్ షో రూమ్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 11,000 చెల్లించి కొత్త మారుతి విక్టోరియస్ కారును బుక్ చేసుకోవచ్చు” అని అన్నారు.

కొత్త విక్టోరియస్ 1.5 లీటర్ హైబ్రిడ్ కారు పెట్రోల్, సిఎన్జి ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 21.18 కి.మీ.పి.ఎల్ మైలేజీ ఇస్తుండగా, హైబ్రిడ్ e-CVT మోడల్ 28.65 కి.మీ.పి.ఎల్ మైలేజీ ఇస్తుంది. భద్రతలో ఇది భారత్ NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది.ఏడు సింగిల్ టోన్, మూడు డ్యూయల్ టోన్ కలర్స్‌లో లభించే ఈ కొత్త విక్టోరియస్‌లో లెవల్ 2 ADAS ఫీచర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 360 డిగ్రీ హెచ్‌డీ కెమెరా, ABS విత్ EBD వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ పవన్ మోటార్స్ సీఈఓ కె. రవి రెడ్డి, షోరూమ్ సిబ్బంది, కస్టమర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ:Bigg Boss 9 Promo: ఆడవారిపై ఆ ప్రతాపం ఏంటి.. సుమన్ శెట్టి పై మండిపాటు!

Related News

CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్

Amaravati News: తాడేపల్లిలో రాజగోపాల్‌రెడ్డి బస.. జగన్‌తో భేటీ? అసలు మేటరేంటి?

Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

Rain Alert: హెచ్చరిక..! రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగుల పడే ఛాన్స్..

CM Revanthreddy: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం

Telangana Marwadi: ఎవడు ఎక్కడైనా బతకొచ్చు! మార్వాడీ గో బ్యాక్ పై మైనంపల్లి షాకింగ్ రియాక్షన్

IAS officers: రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

Big Stories

×