Manchu Manoj: మంచు మనోజ్ విషయంలో నెటిజన్స్ అనుకున్నదే జరిగింది. మిరాయ్ కనుక భారీ విజయాన్ని అందుకొని మనోజ్ కు పేరు వస్తే కనుక అతని ఆపడం ఎవరి తరం కాదు అని ఎవరైతే అన్నారో అది అక్షరాల నిజంగా మారింది. మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఫ్యామిలీ గొడవల కారణంగా కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన మనోజ్ తన రెండో పెళ్లి తరువాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. దాంతోపాటే తన కెరీర్ ని కూడా మరోసారి సరికొత్తగా మొదలుపెట్టాడు. ఈ ఏడాది భైరవం సినిమాతో రీ ఎంట్రీ షురూ చేసిన మనోజ్ ఆ సినిమాతో తన నెగిటివ్ క్యారెక్టర్ ని బయట పెట్టాడు.
ఇక మిరాయ్ అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో మహాబీర్ లామా గా మనోజ్ నటన ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. మనోజ్ లోని నట విశ్వరూపం మిరాయ్ ద్వారా బయటపడింది. ఈ సినిమాలో తేజ కన్నా ఎక్కువ మనోజ్ కే గుర్తింపు లభించింది. దాదాపు పదేళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మనోజ్ ను చూసి ప్రేక్షకులు సైతం సంతోషించారు. ఇకముందు ఇలాంటి పాత్రలే చేస్తానని, ఇలానే ప్రేక్షకులను అలరిస్తానని మనోజ్ కూడా చెప్పుకొచ్చాడు.
ఇక మిరాయ్ ఎఫెక్ట్ మనోజ్ కు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెడుతుంది అని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మనోజ్.. మెగాస్టార్ చిరంజీవి కే దీటైన విలన్ గా మారనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విశ్వంభర ఇప్పటికే రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా ఈ మధ్యనే చిరు.. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కొల్లితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమాస్ యాక్షన్ సినిమాకు మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్ గా పనిచేస్తున్న విషయం కూడా విదితమే
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరుకు ధీటైన విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ రోల్ కి చాలా ప్రాముఖ్యతతో ఉండబోతుందని, దానికి మనోజ్ అయితే గట్టిగా న్యాయం చేస్తాడని బాబీ అనుకున్నాడట. అందుకే మనోజ్ ని ఈ రోల్ కి సెలెక్ట్ చేసినట్లు సమాచారం. నిజం చెప్పాలంటే ఈ కాంబో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.. ఎందుకంటే ఒకానొక సమయంలో చిరంజీవికి మోహన్ బాబు విలన్ గా నటించాడు. ఇక ఇప్పుడు కొడుకు విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇది డెడ్లీ కాంబినేషన్ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.